Onion Hair Serum: జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరగాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. అయితే ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. ఇందుకు బయట కాలుష్యం, దుమ్మూ, ధూళి, స్ట్రెస్, ఇతర అనారోగ్య సమస్యల వల్ల జుట్టు రాలిపోతుంటుంది. దీనికోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. బయట మార్కెట్లో హెయిర్ ఆయిల్స్, హెయిర్ సీరమ్, హెయిర్ షాంపులు ఉపయోగిస్తుంటారు. వీటివల్ల ఫలితం ఉండకపోవచ్చు.
పైగా వీటివల్ల అనేక ఆనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఒక్కసారి ఉల్లిపాయలు, మస్టర్డ్ ఆయిల్‌లో వీటిని కలిపి హెయిర్ సీరమ్ ట్రై చేయండి. జుట్టు రాలడాన్ని తగ్గించి పొడవుగా పెరిగేందుకు ప్రోత్సహిస్తుంది. మరి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్ధాలు
ఉల్లిపాయలు
మెంతులు
కరివేపాకు
బ్లాక్ సీడ్స్
నువ్వులు
ఆవాల నూనె
తయారు చేసుకునే విధానం
ముందుగా స్టవ్ వెలగించి కడాయి పెట్టుకుని అందులో రెండు కప్పుల ఆవాల నూనె, కరివేపాకు, నువ్వులు రెండు టేబుల్ స్పూన్, మెంతులు టేబుల్ స్పూన్, చిన్న ఉల్లిపాయలు నాలుగు, బ్లాక్ సీడ్ టేబుల్ స్పూన్ వేసి బాగా 10 నిమిషాల పాటు మరిగించండి. ఆ తర్వాత స్టవ్ కట్టేసి వేరే గిన్నెలోకి వడకట్టుకోవాలి. ఈ ఆయిల్‌ను ప్రతిరోజు జుట్టుకు పెట్టుకోవచ్చు. లేదా రాత్రి పడుకునే ముందు పెట్టుకుని.. మరుసటి రోజు తలస్నానం చేయొచ్చు. ఇలా క్రమం తప్పకుండా చేస్తే.. జుట్టు రాలడాన్ని ఆపి.. పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. చుండ్రు సమస్యలు కూడా తొలగిపోతాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం.