అందమైన, మిలమిల మెరిసేటి పెదవులు.. ముఖం అందాన్ని పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అయితే వేసవిలో పెదవులు చాలా సమస్యలు ఎదుర్కొంటాయి. పెదాలపై తొక్కలు ఎక్కడం, పగుల్లు రావడం, రక్తం కారడం వంటివి జరుగుతాయి. అందువల్ల అలాంటి సమయంలో సరైన సంరక్షణ, ఇంటి నివారణలతో.. మీ పెదాలను సహజంగా నిండుగా, ఆకర్షణీయంగా మార్చుకోవచ్చు.
చాలా మంది ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ లేదా కాస్మెటిక్ ట్రీట్మెంట్లను వాడుతారు. కానీ పెదవులు ఎటువంటి కెమికల్స్ లేదా శస్త్రచికిత్స లేకుండా కూడా బొద్దుగా, అందంగా ఉంటాయి. మీరు కూడా మీ పెదాలను సహజంగా మందంగా, గులాబీ రంగులో మార్చుకోవాలనుకుంటే.. కొన్ని సులభమైన ఇంటి నివారణలు, స్కిన్ కేర్ టిప్స్ ఇక్కడ ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం
పుష్కలంగా నీరు తాగాలి
పెదవులు పొడిగా, పగిలినట్లు కనిపిస్తే, మీ శరీరంలో నీటి కొరత ఉందని అర్థం. పెదవులు సహజంగా మృదువుగా, నిండుగా కనిపించేలా.. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడం చాలా ముఖ్యం. రోజంతా 8-10 గ్లాసుల నీరు తాగాలి. పెదవులపై రోజువారీ లిప్ బామ్ లేదా కొబ్బరి నూనె రాయాలి.
ఎక్స్‌ఫోలియేట్ చేయండి
పెదవుల నుండి డెడ్ స్కిన్ తొలగించడం వల్ల అవి మృదువుగా, నిండుగా కనిపిస్తాయి. వారానికి 2-3 సార్లు చక్కెర, తేనె స్క్రబ్‌తో మీ పెదాలను తేలికగా రుద్దండి. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ పెరిగి పెదాలు గులాబీ రంగులో, నిండుగా కనిపిస్తాయి. మీరు బ్రష్‌తో తేలికపాటి మసాజ్ కూడా చేయవచ్చు.
ఆరోగ్యకరమైన ఆహారాలు తినడం
కొల్లాజెన్ అనేది చర్మం, పెదాలను ఆరోగ్యంగా, సంపూర్ణంగా ఉంచడంలో సహాయపడే ప్రోటీన్. ఆహారంలో గుడ్లు, చేపలు, గింజలు, విటమిన్ సి అధికంగా ఉండే పండ్లను (నారింజ, కివి, స్ట్రాబెర్రీ) చేర్చండి. ఇది పెదాల అందాన్ని కాపాడుతుంది.
సహజ నూనెలు
పెదవులు మృదువుగా, నిండుగా ఉండాలంటే రాత్రి పడుకునే ముందు కొబ్బరినూనె, ఆలివ్ ఆయిల్ లేదా బాదం నూనె రాసుకోవాలి. పెప్పర్మింట్ ఆయిల్ కూడా మంచి ఎంపిక. ఎందుకంటే ఇది రక్త ప్రసరణను పెంచడం ద్వారా పెదాలను కొద్దిగా బొద్దుగా చేస్తుంది. అవి నిండుగా కనిపిస్తాయి.
పెదవి వ్యాయామాలు
కొన్ని సాధారణ వ్యాయామాలు చేయడం ద్వారా పెదాలకు సహజమైన ఆకృతిని, పూర్తి రూపాన్ని ఇవ్వవచ్చు. “O”, “E” అని మీ పెదాలతో పలకాలి. ఇది పెదవుల కండరాలను బిగుతుగా చేస్తుంది. పెదవులను కొద్దిగా గుండ్రంగా చేసి, కొన్ని సెకన్ల పాటు పట్టుకుని, ఆపై విడుదల చేయండి.