సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంటిలోని వంట గదిలో వెల్లుల్లి ఉంటుంది. ఇది లేనిదే ఏ వంటకం చేయలేరు. సువాసన, రుచి కోసం దీన్ని రసం, కూర్లల్లో ఎక్కువగా వాడుతారు. అయితే ఇది ఆరోగ్యాన్నీ చాలా రక్షిస్తుంది. వెల్లుల్లి ఆరోగ్యం పై చూపించే ప్రభావాలకు సంబంధించి కొన్ని అపోహాలు ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.
అన్ని రకాల వ్యాధులకు మెడిసిన్
వెల్లుల్లి అన్ని వ్యాధులను నయం చేస్తుందనే అపోహ చాలామందిలో ఉంది. వాస్తవానికి చెప్పాలంటే వెల్లుల్లిలో యాంటీ మైక్రో బయల్ గుణాలు ఉంటాయి. ఇవి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అయితే వెల్లుల్లిని ఏ వ్యాధికైనా పూర్తిస్థాయి చికిత్సగా ఉపయోగించకూడదు. ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించినా వైద్యుడు సూచించిన చికిత్సకు ప్రత్యామ్నాయంగా వెల్లుల్లిని ఉపయోగించకూడదు.
పచ్చి వెల్లుల్లి మేలు
కొంతమంది పచ్చి వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిదని నమ్ముతారు. ఇందులో ఎక్కువ అల్లిసిన్ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి కావలసిన ప్రయోజనాలను అందిస్తుంది. అయితే వంటల్లో ఉపయోగించిన వెల్లుల్లిలో పోషకాలు కాస్త తక్కువగానే ఉంటాయి. అయినా బాడీకి సరిపడా ప్రయోజనాలను అందిస్తుంది.
వెల్లుల్లితో ఆరోగ్యం
వెల్లుల్లి ఎక్కువగా తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి అని అపోహ ఉంది. కానీ ఏ పదార్ధాన్ని అయినా మితంగానే తీసుకోవాలి. మితిమీరిన పదార్థాలు తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తప్పవు. ఎక్కువ వెల్లుల్లి తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు, నోటి దుర్వాసన సమస్యలు వంటివి వచ్చే అవకాశం ఉంది.