Benefits of Mint Leaves: చాలా మంది పుదీనాను నిత్యం పలు వంటకాల్లో ఉపయోగిస్తుంటారు. ఇది ఘాటైనా తాజా వాసనను కలిగి ఉంటుంది. దీంతో పూదీనా వల్ల వంటకాలకు రుచి, చక్కని వాసన వస్తాయి. అయితే రుచి, వాసనలకే కాదు.. ఔషద గుణాలకు కూడా పుదీనా పెట్టింది పేరు. ఇందులో ఉండే పోషకాలు మనకు ఎంతో మేలు చేస్తాయి. పలు అనారోగ్య సమస్యలను నయం చేస్తాయి. ఈ నేపథ్యంలో పుదీనాతో ఎలాంటి అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది
పుదీనా ఆకులను వేసి కాచిన టీని తాగితే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. మలబద్దకం, అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. పుదీనా ఆకులను మెత్తగా నలిపి, మిశ్రమంగా చేసి దాంతో పళ్లు తోముకుంటే.. మిల మిలా మెరుస్తాయి.
చర్మంపై దురద, మంటలను తగ్గిస్తుంది.
చర్మంపై ఎక్కడైనా మంటగా, దురదగా ఉంటే. కొన్ని పుదీనా ఆకులను నలిపి ఆయా ప్రదేశాలపై రాస్తే.. ఈ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. పుదీనా ఆకుల రసం, నిమ్మరసం, తేనె లను ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుంటే.. అజీర్ణం, కడుపు ఉబ్బరం, వికారం, వాంతులు తగ్గుతాయి.
తలనొప్పి తగ్గిస్తుంది
పుదీనా ఆకులను ముద్దగా చేసి తలపై పెట్టుకుంటే.. తలనొప్పిని ఇట్టే తగ్గిస్తుంది. పుదీనా ఆకులను కషాయంగా తీసుకుని పుక్కిలిస్తే.. గొంతు నొప్పి తగ్గుతుంది. దంత సంబంధ వ్యాధులకు కూడా ఈ మిశ్రమాన్ని వాడవచ్చు.
ముఖ సౌందర్యాన్ని పెంచుతుంది.
పుదీనా ఆకులను పేస్ట్ చేసి అందులో కొంచెం పసుపు కలిపి.. ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల తర్వాత నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే ముఖ సొందర్యాన్ని సంతరించుకుంటుంది. ముఖం అందంగా, కాంతివంతంగా మెరుస్తుంది. ముఖంపై మచ్చలు తొలగిపోతాయి.
జుట్టు పెరుగుదలను ప్రొత్సహిస్తుంది.
పుదీనా ఆకుల రసంలో కొద్దిగా కొబ్బరి నూనె కలిపి జుట్టుకు అప్లై చేస్తే.. జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడంతో పాటు.. చుండ్రు సమస్యలను తగ్గిస్తుంది.