Miss World 2024 Krystyna: యాదాద్రి ఆలయాన్ని దర్శించుకున్న.. మిస్ వరల్డ్ క్రిస్టినా

Miss World 2024 Krystyna Pyszková

Miss World 2024 Krystyna Pyszková: యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని మిస్ యూనివర్స్ విక్టోరియా క్జార్ సందర్శించారు. శ్రీ శ్రీ లక్ష్మీనరసింహస్వామి స్వామి వారి జన్మ నక్షత్రం, శాంతి నక్షత్రంతో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మిస్ యూనివర్స్ రాకతో ఆలయ ఈవో భాస్కర్ రావు ఆమెకి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి.. వేద ఆశీర్వచనంతో పాటు స్వామి వారి ఫోటో, ప్రసాదము అందజేసారు. అనంతరం మిస్ యూనివర్స్ ఆలయ వీధులు తిరుగుతూ హల్ చల్ చేశారు. ఆలయ చరిత్ర, విశిష్టత మొదలగు వివరాలను అక్కడి అధికారులని అడిగి తెలుసుకున్నారు. ఆలయాన్నిసందర్శించడం గొప్ప అనుభూతని ఆశాభావం వ్యక్తం చేశారు.

వివరాల్లకి వెళ్తే..  చెక్ రిపబ్లిక్ మోడల్, మిస్ వరల్డ్ 2023 క్రిస్టినా పిస్జ్కోవా హైదరాబాద్ వచ్చారు! భారతీయ సాంప్రదాయ చీరకట్టు లో ఆమె మంగళవారం యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ని దర్శించుకున్నారు ఆసక్తిగా! మే 7 నుంచి హైదరాబాద్ లో మిస్ వరల్డ్ 2024 పోటీలు జరుగుతున్న నేపథ్యంలో ఈనెల 20న నిర్వహించనున్న ప్రి లాంచ్ ఈవెంట్ లో పాల్గొనేందుకు క్రిస్టినా హైదరాబాద్ లో అడుగు పెట్టారు. హైదరాబాద్ ఘన చారిత్రత్మాక సంపద చార్మినార్, ఫలక్ నుమా ప్యాలెస్, చౌమొహల్లా ప్యాలెస్, గోల్కొండ లను సందర్శించనున్నట్లు క్రిస్టినా తెలిపారు. యాదిగిరి గుట్ట లక్ష్మీ నృసింహుడి ఆలయంలో శిల్పకళా సౌందర్యం ఉట్టిపడుతోందని ప్రపంచ సుందరి-2024 క్రిస్టినా పిస్జ్కోవా అన్నారు.

మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే వివిధ దేశాలకు చెందిన 120 మంది అందాల భామలు యాదగిరి గుట్ట స్వామిని దర్శించుకునేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నారని టూరిజం కార్యదర్శి స్మిత సభర్వాల్ తెలిపారు. క్రిస్టినా ఇవాళ లక్ష్మీ నరసింహ స్వామి వారిని సందర్శించుకుని, దేవాలయ ఆధ్యాత్మిక సౌందర్య సంపద చూసి అచ్చెరువొందారని ఆమె చెప్పారు. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణతో ప్రపంచ దేశాలన్నీ తెలంగాణ వైపు చూస్తున్నాయని స్మిత సభర్వాల్ సంతోషం వ్యక్తం చేశారు.

ప్రపంచంలో ఇప్పటివరకు జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో క్రిస్టినా 71వ టైటిల్ విన్నర్! 112 దేశాల మోడల్స్ తో పోటీ పడి ఆమె 2023 మిస్ వరల్డ్ టైటిల్ కైవసం చేసుకుంది.

 

తరవాత కథనం