Kalki 2 movie: ‘కల్కి2’ స్టోరీ, షూటింగ్, ప్రభాస్ రోల్‌పై కిక్కిచ్చే సర్‌ప్రైజ్.. దర్శకుడు ఏం చెప్పాడంటే?

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉన్నాడు. వరుసగా సినిమాలను లైన్ లో పెట్టాడు. గతేడాది కల్కి మూవీ తో వచ్చి బాక్సాఫీస్ ను షేక్ చేశాడు. నాగ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సినీప్రియుల్ని అలరించింది. ఇందులో స్టార్ కాస్టింగ్ నటించింది. అమితాబ్ బచ్చన్, కమలహాసన్, దీపిక పదుకొనే, దిశాపటాని, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ వంటి నటీనటులు ఇందులో భాగమయ్యారు.

భారీ స్థాయిలో విడుదలైన సినిమా కలెక్షన్ వర్షం కురిపించింది. రూ. 2000 వేల కోట్ల వసూళ్లను రాబట్టి నిర్మాతలకు లాభాల పంట పండించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ అనంతరం సెకండ్ పార్ట్ గురించి అనౌన్స్ చేశారు. అప్పటినుంచి దీనిపై మరింత బజ్ ఏర్పడింది. ఎప్పుడెప్పుడు ఈ సీక్వెల్ గురించి అప్డేట్ వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలో దర్శకుడు అందించిన అప్డేట్ ప్రభాస్ అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది. కల్కి 2 మూవీ స్టోరీ, షూటింగ్, ప్రభాస్ రోల్ కు సంబంధించి దర్శకుడు నాగ్ అశ్విన్ అదిరిపోయే ట్రీట్ అందించాడు. అతడు దర్శకత్వం వహించిన ఎవడే సుబ్రహ్మణ్యం మూవీ విడుదలై 10 సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

అందులో కల్కి సీక్వెల్ పై ఎక్కువగా ప్రశ్నలు వచ్చాయి. వాటిపై స్పందించిన దర్శకుడు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ప్రస్తుతం కల్కి సీక్వెల్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది అన్నాడు. అయితే ఇప్పటికీ తాము ప్రాజెక్ట్ కే అంటే ఏంటి అనే దగ్గరే ఇంకా ఉన్నామని అన్నారు. అది కంప్లీట్ అయిన తర్వాతే షూటింగ్ మొదలు పెడతామని చెప్పుకొచ్చాడు.

ఎలా లేదన్నా ఈ ఏడాది ఆఖరి నాటికి సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని తెలిపాడు. సెకండ్ పార్ట్ లో ప్రభాస్ పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా భైరవ, కర్ణ నేపథ్యంలోనే స్టోరీ సాగుతుందని అన్నాడు. వీటికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని చెప్పుకొచ్చాడు. అయితే దీనికోసం చాలా హార్డ్ వర్క్ చేయాలని.. అందువల్ల మూవీ రిలీజ్ డేట్ ఇప్పుడే చెప్పలేమని అన్నాడు. దీంతో నాగ్ అశ్విన్ మాటలు ప్రభాస్ అభిమానుల్లో ఫుల్ జోష్ నింపాయి.

తరవాత కథనం