Hibiscus flower: అవునా నిజమా.. మందార పువ్వుతో ఇన్ని బెనిఫిట్సా.. అమేజింగ్!

మందార పువ్వు చూడటానికి చాలా అందంగా నిగనిగలాడుతూ ఉంటుంది. అయితే దీన్ని తలలో పెట్టుకోకపోయినా ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. దీనివల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే అస్సలు ఈ పువ్వును వదిలిపెట్టరు. ఇందులో విటమిన్ సి, కాల్షియం, యాంటీ యాక్సిడెంట్లు, ఐరన్ పుష్కలంగా ఉంటాయి.

అందువల్ల ఇది ఎన్నో రకాలు వ్యాధులను నయం చేస్తుంది. జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. ఈ పువ్వులో ఉండే పోషకాలు రక్త ప్రవాహాన్ని మెరుగు పరుస్తాయి. దీని ద్వారా రక్తపోటును క్రమక్రమంగా తగ్గించవచ్చు. ఇక బరువు తగ్గాలని ఎప్పటినుంచో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇది ఒక ఔషధమనే చెప్పాలి. మందార ఆకులతో తయారు చేసిన టీ తాగడం వల్ల కొవ్వును కరిగించవచ్చు.

దీని ద్వారా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే మందార పువ్వు చర్మ సౌందర్యాన్ని, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతో సహాయపడుతుంది. ఈ పువ్వులతో తయారు చేసిన ఫేస్ మాస్క్ ను ఉపయోగించడం వల్ల స్కిన్ మిలమిల మెరిసిపోతుంది. అంతేకాకుండా ముఖంపై ఉన్న మొటిమలను తగ్గించడానికి ఈ పువ్వు ఉపయోగపడుతుంది.

ఇంకా ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గించి.. మంచి కొలెస్ట్రాలను పెంచుతుంది. అదే సమయంలో ఒత్తిడి, క్యాన్సర్, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా మందార పువ్వు జుట్టు పెరుగుదలకు ఎంతగానో సహాయపడుతుంది. ఈ పువ్వుతో తయారు చేసిన నూనె వాడటం వల్ల కుదుళ్ళు దృఢంగాను.. జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.

మందార పువ్వు టీ తాగడం వల్ల జీర్ణ క్రియ, మలబద్ధకం వంటి సమస్యలు దూరం అవుతాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ పువ్వును పలు విధాలుగా ఉపయోగించే ముందు సమీప వైద్యుల్ని సంప్రదించాలి. వారి సలహాతో ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది.

తరవాత కథనం