ప్రపంచమంతా కన్నార్పకుండా చూసిన క్షణం…. అంతరిక్షంలో 17 గంటల క్రితం బయల్దేరిన డ్రాగన్ క్యాప్సూల్ నుంచి ప్యారాచూట్స్ విచ్చుకుంటున్న దృశ్యం… కోట్ల మంది ప్రార్థనల ఫలితం… సునీత సురక్షితంగా తల్లి ఒడికి చేరారు. తొమ్మిది నెలల అంతరిక్షవాసం ముగించుకున్న సునీతా విలియమ్స్, విల్‌మోర్‌తోపాటు మరో ఇద్దరు వ్యోమగాములు స్వచ్ఛమైన గాలి పీల్చుకున్నారు. నాసా, స్పేస్ ఎక్స్ పంపించిన డ్రాగన్ క్యాప్సూల్‌లో సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్, నాసా వ్యోమగామి, మిషన్ కమాండర్ నిక్ హేగ్, రోస్‌కాస్మస్ వ్యోమగామి అలెగ్జాండర్ గుర్బునోవ్ ఫ్లోరిడా తీరానికి ఈ ఉదయం చేరుకున్నారు. వాళ్లును తీసుకొచ్చే క్యాప్సూల్ ఉదయం మూడు గంటల 27నిమిషాలకు భూమికి చేరింది. ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న మహాద్భుతం ఆవిష్కృతమైంది. సునీతా విలియమ్స్ టీంను తీసుకొచ్చే ఆపరేషన్ సక్సెస్ అవ్వడంతో నేలతల్లి విజయ గర్వంతో నవ్వింది.
మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన సునీతా విలియమ్స్‌అండ్ టీం ప్రయామం ఈ ఉదయంతో ముగిసింది. వేకువ జామున ఫ్లోరిడాలోని తల్హసీ తీరంలోని గల్ఫ్ ఆఫ్ అమెరికా జలాల్లో వీళ్లు ప్రయాణించే క్యాప్సూల్ సురక్షితంగా దిగింది. సునీతా విలియమ్స్ అండ్ టీం వచ్చే క్యాప్సూల్స్ దిగుతున్న సమయంలో ఉద్వేగభరితమైన వాతావరణం నెలకొంది. క్యాప్సూల్‌కు ఉన్న నాలుగు పెద్ద ప్యారాచూట్‌లో తెరుచుకోవడంతో నాసా సిబ్బంది ఆనందంతో కేకలు వేశారు. వారి రాకను నాసా విజయాన్ని అభినందిస్తూ చప్పట్లు కొట్టారు.
నాలుగు ప్యారాచూట్స్ తెరుచుకున్న తర్వాత ఆ క్యాప్సూల్ నెమ్మదిగా జలాల్లోకి దిగింది. వెంటనే నాసా రక్షణ సిబ్బంది వారిని తీసుకొచ్చేందుకు ముందుకు వెళ్లారు. అయితే వారిని ఓ దృశ్యం ఆపు చేసింది. క్యాప్సూల్ ఠపీమని పడటంతో అక్కడ కొన్ని డాల్పిన్స్ చక్కర్ల కొట్టడం కనిపించింది. క్యాప్సూల్స్‌కు రక్షణగా మేం ఉన్నాం అన్నట్టు గుంపుగా తిరిగే తిమింగలాలు ఆకట్టుకున్నాయి. దీంతో రక్షణ సిబ్బంది కాసేపు ఆగి ముందుకు వెళ్లాల్సి వచ్చింది.
సునీతా విలయమ్స్ తిరిగి వచ్చిన క్యాప్సూల్స్ చుట్టూ తిమింగలాలు చేరిన దృశ్యాలను నాసా కూడా తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో పంచుకుంది. వ్యోమగాములకు అరుదైన స్వాగతం అని కామెంట్ చేసింది. ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతుంటాయని సునీతా విలియమ్స్ టీంకు ప్రకృతి సాయం ఉందని నెటిజన్లు కూడా అభిప్రాయపడ్డారు. ఆ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నయాి.
క్యాప్సూల్ సముద్ర జలాలపైకి వచ్చిన తర్వాత తిమింగాలను లేని చోట నుంచి రక్షణ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. క్యాప్సూల్‌లో ఉన్న వ్యోమగాములను సురక్షితంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని నౌకలోకి తీసుకొచ్చారు.ముందుగా నిక్ హేగ్‌ను బయటకు తీసుకొచ్చారు. ఆయనచిరునవ్వులు చిందిస్తూ విజయం గర్వంతో కనిపించారు. ఆయన్ని స్ట్రెచ్చర్‌పై కూర్చోపెట్టుకొని మరో నౌకలోకి తీసుకెళ్లిపోయారు. అనంతరం అలెగ్జాండర్ గుర్బునోవ్ ను తర్వాత సునీతాను బయటకు తెచ్చారు. ఆమె కూడా చిరునవ్వు చిందిస్తూ విజయానికి చిహ్నంగా థంబ్సప్ చూపించారు. చివరిగా బుచ్ విల్‌మోర్ ను బయటకు తెచ్చారు.
క్యాప్సూల్ నుంచి బయటకు తెచ్చిన తర్వాత సునీతా విలయమ్స్ అండ్ టీంను హ్యూస్టన్‌లోని నాసాకు చెందిన జాన్సన్ స్పేస్ సెంటర్‌కు తీసుకెళ్లారు. అక్కడ వాళ్లు పూర్తిగా రెస్టు తీసుకుంటారు. ప్రయాణబడలిక పూర్తిగా వదిలిన తర్వాత వారిని ఫ్యామిలీ మెంబర్స్‌కు కలిసే అవకాశం కల్పిస్తాు. దీనికి సుమారు ఒకరోజు పడుతుందని నాసా అభిప్రాయపడింది. ప్రస్తుతానికి నలుగురు వ్యోమగాలు సురక్షితంగా ఉన్నారని నాసా ప్రకటించింది.వారికి ఎలాంటి ఆనారోగ్య సమస్యలు లేవని తెలిపింది. 9 నెలలుగా అంతరిక్షంలో ఇరుక్కుపోయిన వారిని ఇలా సురక్షితంగా తీసుకురావడం చాలా సంతోషంగా ఉందని నాసా అభిప్రాయపడింది. ఈ సునీతా టీం 900 గంటలపాటు 150 ప్రయోగాలు అంతరిక్షంలో జరిపినట్టు నాసా వెల్లడించింది.