White Hair Tips: తెల్లజుట్టు నల్లగా మార్చే.. బెస్ట్ టిప్ ఇదే..!

White Hair Tips

White Hair Tips: ఈ రోజుల్లు చాలా మంది జుట్టు రాలే సమస్యతో పాటు.. తెల్లజుట్టు సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. నిండా 30 ఏళ్లు నిండకుండానే జుట్టు తెల్లగా వచ్చేస్తుంది. ఇందుకు జీవనశైలిలో మార్పులు, పోషకాహారం ఆహారం తినకపోవడం, ఒత్తిడి వల్ల, రకరకాల షాంపులు వాడటం వల్ల చిన్న వయసులోనే తెల్లజుట్టు వచ్చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం బయట మార్కెట్లో రకరకాల హెయిర్ ఆయిల్స్, హెయిర్ కలర్స్ వంటివి ఉపయోగిస్తుంటారు.

వీటివల్ల చర్మ సంబంధిత సమస్యలు, మతిమరుపు, మెదడులో ఇన్ఫక్షన్ వంటి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందట. మరి దీనికి పరిష్కారం.. మన ఇంట్లోనే నాచురల్‌గా తయారు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. వీటివల్ల జుట్టు నల్లబడడంతో పాటు, జుట్టు పొడవుగా, ఒత్తుగా, దృఢంగా పెరుగుతుంది. ఇందుకోసం మస్టర్డ్ ఆయిల్‌లో వీటిని కలిపి జుట్టుకు అప్లై చేశారంటే.. మంచి రిజల్ట్ మీకు కనిపిస్తాయి. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

కావాల్సిన పదార్దాలు
మస్టర్డ్ ఆయిల్
పసుపు
కాఫీ పొడి
విటమిన్ ఇ క్యాప్సూల్స్
గోరింటాకు పొడి

తయారు చేసుకునే విధానం
ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని, అందులో మస్టర్డ్ ఆయిల్, పసుపు, కాఫీ పొడి, గోరింటాకు పొడి కలిపి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మరిగించండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని వేరెగిన్నెలోకి తీసుకుని అందులో రెండు విటమిన్ ఇ క్యాప్సూల్స్ వేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు అప్లై చేసి, అరగంట తర్వాత సాధారణ షాంపూతో తలస్నానం చెయ్యండి. ఇలా వారానికి ఒకసారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది. జుట్టుకు ఎలాంటి హాని కలగదు. క్రమం తప్పకుండా ఇలా చేయండి.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం.

తరవాత కథనం