Sunflower seeds Benefits: ప్రతి రోజూ సన్‌ఫ్లవర్ సీడ్స్ తింటే.. ఏం జరుగుతుందో తెలుసా..?

Sunflower seeds Benefits

ప్రొద్దు తిరుగుడు విత్తనాల్లో విటమిన్ ఇ, సెరీనియం, కాపర్‌ను కలిగి ఉంటాయి. ఇవి నాచురల్ యాంటీ ఆక్సీడెంట్స్.. ఇవి కాన్సర్‌కు కారణమయ్యే సెల్యూలార్ డామేజ్‌ను నివారిస్తాయి. సన్ ఫ్లవర్ సీడ్స్ మెగ్నీషియంకు ఉత్తమ మూలం. ఎముకల ఆరోగ్యానికి మెగ్నీషియం, కాల్షియం చాలా అవసరం. కాబట్టి ప్రతిరోజు నానబెట్టుకుని ప్రొద్దుతిరుగుడు విత్తనాలు తింటే.. ఎముకలకు బలాన్ని చేకూరుస్తాయి. సలాడ్స్, సూప్స్, బ్రెడ్స్‌లలో కలిపి తీసుకోవచ్చు.

సన్‌ఫ్లవర్ సీడ్స్‌లో ఉండే మెగ్నీషియం ఒత్తిడిని తగ్గిస్తాయి. నాడి వ్యవస్థను మెరుగుపరిచి స్ట్రెస్‌ను తగ్గిస్తుంది. దాంతో మైగ్రేన్ తలనొప్పిని తగ్గించుకోవచ్చు. ఈ విత్తనాలు కొలెస్ట్రాల్ లెవల్‌ను తగ్గిస్తుంది. వీటిలో ఉండే ఫైబర్ కంటెంట్ బరువు తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. సన్‌ఫ్లవర్ సీడ్స్‌లో ఉండే విటమిన్ సి గుండె సంబంధిత సమస్యల నుండి రక్షిస్తుంది. ఇవి ఆరోగ్యానికే కాదు.. చర్మ, జుట్టు సమస్యలను కూడా చాలా మంచిది. ఇవి చర్మ సౌందర్యాన్ని పెంచడంతో పాటు.. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

పొద్దుతిరుగుడు విత్తనాలు ఆరోగ్యానికి చాలా మంచివి. ఇవి శరీరానికి పోషకాలను అందించి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. చిన్న పిల్లలు, పెద్దవారు అందరూ తినేందుకు అనువైనవి. రోజూ కొంత పరిమాణంలో తింటే శరీరానికి కావాల్సిన అనేక ప్రయోజనాలను అందించగలవు.

తరవాత కథనం