Betting Apps Issue: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ హాట్ టాపిక్‌గా మారింది. గతంలో డ్రగ్స్ కేసులో పెద్ద పెద్ద టాలీవుడ్ సెలబ్రిటీలంతా దర్యాప్తు సంస్థల ముందు విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసి మరో తప్పు చేశారంటూ పోలీసులు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే పలువురికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తున్నారు.విష్ణు ప్రియ,రీతూ చౌదరి ఇప్పటికే విచారణకు హాజరయ్యారు. ఆరుగురు ప్రముఖ యాక్టర్స్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు సహా మొత్తం 25 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
రానా, విజయ్ దేవరకొండ, ప్రకాశ్‌రాజ్, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్‌పై తాజాగా కేసు నమోదు చేశారు. శ్యామల, శ్రీముఖి, రీతూ చౌదరి, విష్ణుప్రియ, వర్షిణి, అనన్య నాగళ్ల, సిరి హనుమంతు, వసంతికృష్ణన్,శోభాశెట్టి, అమృత చౌదరి, నాయని పావని, నేహా పఠాన్, పద్మావతి, పండు, ఇమ్రాన్‌ఖాన్, హర్షసాయి, బయ్యా సన్నీ యాదవ్, టేస్టీ తేజ, బండారు సుప్రీతపై కేసు పెట్టారు. మియాపూర్ వాసి ప్రమోద్ శర్మ ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు చేపట్టారు.
వివాదం పెద్దదవుటుండడంతో బెట్టింగ్ యాప్ ప్రమోషన్‌లపై ఒక్కొక్కరుగా రియాక్ట్ అవుతున్నారు. బెట్టింగ్ APP ప్రమోషన్ అంశంపై విజయ్ దేవర కొండ టీమ్ రియాక్టయ్యింది. చట్ట ప్రకారం నిర్వహించే స్కిల్ బేస్డ్ గేమ్స్ కి మాత్రమే విజయ్ దేవరకొండ పని చేస్తారని క్లారిటీ ఇచ్చింది. ఏ యాడ్ చేసినా, ఏ కంపెనీకి అంబాసిడర్‌గా ఉన్నా.. ఆ సంస్థ లీగల్ గా నిర్వహిస్తారా లేదా చూస్తామని స్పష్టం చేసింది టీమ్ దేవరకొండ. గతంలో ఆయన పని చేసిన ఏ 23 అనే సంస్థ సరైందని అంటోంది విజయ్ దేవరకొండ టీమ్. రమ్మీ స్కిల్ బేస్డ్ గేమ్ అంటూ సుప్రీం కోర్టే చెప్పిన విషయాన్ని గుర్తు చేసింది విజయ్ దేవరకొండ బృందం. విజయ్ దేవరకొండ విషయంలో పలు మాధ్యమాల్లో తప్పుడు కథనాలు ప్రసారమవుతున్నాయనీ.. ఇల్లీగల్ గా విజయ్ ఏ సంస్థకూ ప్రచారం చేయలేదని వీరు తమ ప్రకటన ద్వారా తెలియజేశారు.
ఇక నటుడు ప్రకాష్‌రాజ్. బెట్టింగ్ యాప్ యాడ్ తాను ఎలా చేశానని ప్రశ్నిస్తున్నారని.. అందర్నీ ప్రశ్నించే తాను సమాధానం చెప్పాల్సి ఉందన్నారాయన. 2016లో ఆ ప్రకటనలో నటించానని.. కొన్ని నెలల్లోనే అది తప్పు అని తనకు తెలిసిందన్నారు. అందుకే 2017లో ఆ కాంట్రాక్ట్ రెన్యువల్‌కు ఒప్పుకోలేదన్నారాయన. అంతేకాదు 2017 నుంచి ఆ యాడ్ వాడొద్దని చెప్పానన్నారు. ఆ తర్వాత ఏ గేమింగ్ యాప్‌ను ప్రమోట్ చేయలేదని చెప్పారు. ఆ కంపెనీని కొన్న మరో కంపెనీ అదే యాడ్‌ను సోషల్ మీడియాలో పెడితే నోటీసులు కూడా పంపించానన్నారు. యూత్ ఎవరూ ఇలాంటి యాప్‌లు వాడొద్దంటూ విజ్ఞప్తి చేశారు ప్రకాష్‌రాజ్.హైదరాబాద్ పోలీసులు నోటీసులు ఇచ్చిన సమయంలో ప్రకాశ్ రాజ్ ఇలా వీడియో రిలీజ్ చేయడం ఇంట్రెస్టింగ్‌గా మారింది.
బెట్టింగ్ యాప్స్ ప్రచారం పై సినీ నటుడు రానా PR టీమ్ రియాక్టయ్యింది. చట్టబద్ధమైన గేమ్స్ కి మాత్రమే.. తమ హీరో అంబాసిడర్ గా ఉన్నారని అంటున్నారు వీరు. రానా అంబాసిడర్ గా ఒక ఒప్పందం 2017లోనే ముగిసిందనీ.. ఇప్పుడు ఎలాంటి గేమ్స్‌కి రానా పని చేయడం లేదన్న క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే, స్కిల్ బేస్డ్ గేమ్స్ తప్పులేదని సుప్రీం కోర్టు తీర్పు చెప్పిందనీ అంటారు రానా టీమ్ మెంబర్స్. వీటిలో ఏ గేమ్ చట్టబద్ధమో- వ్యతిరేకమో.. హైలెట్ చేయాల్సిన అవసరం ఉందని కూడా సూచిస్తున్నారు రానా PR టీమ్ మెంబర్స్.