health tips: దంతాలు పసుపు కలర్‌లోకి మారాయా? ఈ పొరపాట్లే కారణం!

సాధారణంగా చాలామంది దంతాలు పసుపు రంగులో ఉంటాయి. వీటి కారణంగా వారు మనస్ఫూర్తిగా నవ్వాలనుకున్నా ఆ సమయంలో కంట్రోల్ చేసుకుంటారు. అయితే ఇది కొందరిలో జన్యుపరమైనదిగా ఉంటుంది. కానీ చాలా వరకు వారి రోజువారి చెడు అలవాట్లతోనే దంతాలు పసుపుగా మారుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తమకు తెలియకుండానే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేయడం వల్ల దంతాలు పసుపు రంగులోకి మారుతాయని అంటున్నారు. అయితే ఆ రోజువారి చెడు అలవాటులని ఇప్పుడు తెలుసుకుందాం.

బాగా బ్రష్ చేయకపోవడం

చాలామంది గంటలు తరబడి బ్రష్ చేస్తూ ఉంటారు. ఇంకొందరు అయితే బ్రష్ కు పేస్టు పెడతారో లేదో అలా కడిగేస్తారు. ఈ రెండు పొరపాట్లు వల్ల దంతాలు పసుపు రంగులోకి మారతాయని వైద్యులు చెబుతున్నారు. బ్రష్ ఎప్పుడు ఎక్కువసేపు చేయకూడదని అలా అని తొందరగానే పైపైన ఇటు అటు తిప్పి కడిగే వద్దని అంటున్నారు. సరైన పద్ధతిలో మార్నింగ్ అండ్ నైట్ బ్రష్ చేయాలని చెబుతున్నారు. అలా చేయకపోతే ఆహారకణాలు, బ్యాక్టీరియా పళ్ళపై చేరి ప్లాక్ ను ఏర్పరుస్తాయని హెచ్చరిస్తున్నారు. దీని కారణంగానే దంతాలు పసుపు రంగులోకి మారుతాయని చెబుతున్నారు.

కార్బోనేటెడ్ డ్రింక్స్

కార్బోనేటెడ్ డ్రింక్స్ అంటే.. కోల్డ్ డ్రింక్స్, సోడా వంటివి ఎక్కువగా తాగడం వల్ల దంతాలు పసుపు రంగులోకి మారుతాయి అని నిపుణులు అంటున్నారు. దీనివల్ల దంతాలు త్వరగా విరిగిపోయే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తున్నారు.

ధూమపానం

ధూమపానం చేసే వారి దంతాలు, పెదవులు పసుపు రంగు లేదా బ్లాక్ రంగులో ఉంటాయి. పొగాకు లో ఉండే నికోటిన్, స్లోగా దంతాలు, పెదాల రంగును మార్చేస్తాయి. క్రమక్రమంగా అవి ఇతర రంగులోకి మారుతాయి. అందువల్ల ధూమపానానికి దూరంగా ఉండాలని చెబుతున్నారు.

చాయ్, కాఫీ

చాయ్, కాఫీ అధికంగా తీసుకోవడం వల్ల దంతాలపై మలినాలు ఏర్పడతాయి. దీనివల్ల పసుపు రంగు వస్తుంది. వీటిలో టానిన్ అనే పదార్థం ఉంటుంది. అది పళ్ళలో ఎనామల్ పొరపై చేరి మచ్చలను ఏర్పరుస్తుంది. క్రమక్రమంగా అదే ఇతర రంగులకు మారుతుంది.

తరవాత కథనం