raja saab: ప్రభాస్ ‘రాజాసాబ్’ టీజర్ రెడీ.. ముహూర్తం ఖరారు!

రెబల్ స్టార్ ప్రభాస్ యమ జోష్ మీద ఉన్నాడు. వరుస సినిమాలను లైన్లో పెట్టేసాడు. అందులో డైరెక్టర్ మారుతీ తో రాజా సాబ్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాపై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. కల్కి మూవీతో వరల్డ్ వైడ్ సంచలనం సృష్టించిన ప్రభాస్.. ఇప్పుడు తన కెరీర్ లో డిఫరెంట్ జానర్ తో రాబోతున్నాడు. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై దీనిని టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ఇందులో ప్రభాస్ సరసన ఇద్దరు ముద్దుగుమ్మలు నటిస్తున్నారు. అందులో ఒకరు నిధి అగర్వాల్ కాగా మరొకరు మాళవిక మోహనన్. వీరిద్దరితో పాటు రిద్ది కుమార్ కీలకపాత్రలో నటిస్తుంది. ఇందులో ప్రభాస్ ను ఢీకొట్టే పాత్రలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, ప్రభాస్ ఫస్ట్ లుక్ గ్లిమ్స్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రభాస్ అభిమానులను దృష్టిలో ఉంచుకునే తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

అందువల్లనే అందరి అంచనాలకు మించి తప్ప.. అస్సలు తక్కువ కాదని ఇటీవల దర్శకుడు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. తాజాగా ఈ మూవీ టీజర్ కి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇందులో భాగంగా రాజా సాబ్ టీజర్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ సినిమా టీజర్ ను వచ్చే నెల అంటే ఏప్రిల్ లో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

మూవీ యూనిట్స్ సైతం ఇదే విషయంపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే కామెడీ అండ్ హారర్ జానర్ లో రూపొందుతున్న ఈ సినిమా లో ప్రభాస్ డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు రిలీజ్ అయిన పోస్టర్లు సైతం చూస్తే అర్థమవుతుంది. ఈ చిత్రాన్ని మొదట ఏప్రిల్ నెలలోనే విడుదల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు.

అనివార్య కారణాలవల్ల ఏప్రిల్ లో రిలీజ్ కావలసిన ఈ సినిమా వాయిదా పడింది. అయితే కొత్త డేట్ ను మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. కానీ అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సినీవర్గాలు వెల్లడించాయి.

తరవాత కథనం