ఐపీఎల్ సందడి మొదలవుతుంది. మార్చి 22 అంటే రేపటి నుంచి మ్యాచులు ప్రారంభం కానున్నాయి. మొదటి ఆట కోల్కత్తా నైట్ రైడర్స్ vs రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య రసవత్తరంగా జరగనుంది. వీటి కోసం క్రికెట్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు తమ అభిమాన క్రికెటర్ బ్యాట్ పట్టుకుని బాదుతాడా అని వెయిట్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో వారికి ఒక న్యూస్ గట్టి షాక్ ఇచ్చింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ లో జరగనున్న ఈ తొలి మ్యాచ్ రద్దు కానున్నట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్ కోసం వరునుడు సైతం కాచుకు కూసున్నట్టు తెలుస్తోంది. వర్షం ముప్పు ఉండడంతో కేకేఆర్ వర్సెస్ ఆర్ సి బి మ్యాచ్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందని పలువురు చర్చించుకుంటున్నారు. కోల్కత్తా నగరానికి భారీ వర్ష సూచన ఉన్నట్లు భారత వాతావరణ శాఖ సమాచారం ఇచ్చింది.
దీంతో మొదటి రోజు మ్యాచ్ రద్దు అవ్వడం ఖాయం అనే అనుమానాలు ఏర్పడుతున్నాయి. ఇక ఈ మ్యాచ్కు ముందు గ్రాండ్ లెవెల్ లో ఓపెనింగ్ సేర్మని ఉంది. దీనికోసం బాలీవుడ్ స్టార్ లందరూ సందడి చేయనున్నారు. ఇక వర్షం కారణంగా ఇది కూడా రద్దు అయ్యే అవకాశం కనిపిస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన భారీ తుఫాను కారణంగా అకాల వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ సమాచారం సమాచారం ఇస్తుంది.
అదే సమయంలో ప్రాంతీయ వాతావరణ శాఖ కూడా ఆ నగరానికి ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. దీంతో మార్చ్ 22న మ్యాచ్ జరగడం కష్టమేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అభిమానులు, క్రికెట్ ప్రియులు ఆందోళన చెందుతున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగుతున్న తమ కోల్కతా జుట్టును తొలి మ్యాచ్లో చూసేందుకు ఎంతో ఆసక్తి పడుతున్నారు. మరోవైపు ఆర్ సి బి నుంచి విరాట్ కోహ్లీ బ్యాటింగ్ను చూసేందుకు అతడి ఫ్యాన్స్ తహతహలాడుతున్నారు. ఈ తరుణంలో వర్షం అప్డేట్ వారిని తీవ్ర నిరాశకు గురిచేసింది. చూడాలి మరి ఏం జరుగుతుందో.