Pineapple Benefits: పైనాపిల్ ఆరోగ్యానికి వరం.. తింటే ఎన్ని లాభాలో..

Pineapple Benefits

Pineapple Benefits: శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడం కోసం అందరూ వెతుకుతున్నారు. ఇందుకోసం పోషకాలు నిండిన ఆహారాల్ని తీసుకుంటున్నారు. తాజా కూరగాయలు, ఆకుకూరలతో పాటు, తాజా పండ్లను మెనూలో చేర్చుకుంటున్నారు. అయితే తాజా పండ్లలో శరీరానికి పోషకాలు అందించే పండ్లలో పైనాపిల్ ముఖ్యమైనది. ఇందులో ఉన్న పోషక విలువలు ఏంటి..? పైనాపిల్ మన ఆరోగ్యానికి వర ప్రధాయిని ఎలా అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

పైనాపిల్ దీన్ని అనాస పండు అని పిలుస్తారు. తీపి, వగరు, పుల్ల రుచుల సమ్మేళనంగా పైనాపిల్‌ను మన ఆరోగ్య ప్రదానియిగా చెప్పుకోవచ్చు. శరీరానికి రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరిచే మంచి పోషకాలు ఇందులో ఉన్నాయి. మన ఆరోగ్యానికి అవసరమయ్యే పలు రకాల విటమిన్లు, ఖనిజ లవణాలు దీన్నుంచి మనకు పుష్కలంగా లభిస్తాయి. తద్వారా వైరల్, బాక్టీరియా ఇన్ఫెక్షన్ల నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అంతే కాకుండా పైనాపిల్ తీసుకోవడం వల్ల ఎముకలు బలోపేతం అవుతాయి. అనాస పండులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. దీన్ని నుంచి 85 శాతం నీరు శరీరానికి అందుతుంది. సమ్మర్‌లో ఈ పండును తీసుకుంటే చాలా మంచిది. నీరసాన్ని, తగ్గించడంలో సహాయపడుతుంది.

పైనాపిల్ లో విటమిన్ సి, విటమిన్ B6, విటమిన్ ఎ,కె,ఇ ఎక్కువగా లభిస్తాయి. ఈ విటమిన్ల ద్వారా ఇమ్యూనిటి వ్యవస్థకు మరింత బలం చేకూరుతుంది. మరో వైపు పైనాపిల్‌లో విటమిన్లు కాకుండా కాల్షియం, ఫోలేట్, ఇనుము, మెగ్నీషియం, జింక్ వంటి ఇతర ఖనిజ లవణాలు పుష్కలంగా లభిస్తాయి. కాల్షియం ఎముకల దృఢత్వం కోసం ఎక్కువగా ఉపయోగపడుతుంది. పైనాపిల్ నుంచి లభించే ఇనుము ధాతువు రక్త కణాల వృద్ధిలో సహాయసపడుతుంది. ఎముకలు, దంతాలు దృఢంగా తయారు అయ్యేందుకు పైనాపిల్ చక్కగా ఉపయోగపుడుతుంది. రక్తపోటును అదుపులో ఉంచేందుకు పైనాపిల్ తింటే మంచి ఫలితం ఉంటుంది.

పైనాపిల్‌లో ఉండే బ్రొమేలిన్ జీర్ణక్రియకు తోడ్పడుతుంది. ఆహారం తీసుకున్న తర్వాత పైనాపిల్ ముక్కలు తీసుకునే వారిలో ప్రొటీన్లు త్వరగా జీర్ణమవుతాయి. అనాస పండు తిన్నవెంటనే నాలుక, పెదాల్లో దురద కలుగుతుంది. బ్రొమేలిన్ ఎంజైమమ్ ప్రొటీన్లను విఛ్చిన్నం చేస్తుంది కాబట్టే ఇలా చేస్తుంది. అలాగే పైనాపిల్ నుంచి తీసిన బ్రొమేలిన్ పదార్దాన్ని పలు రకాల ఆనారోగ్య సమస్యలకు చికిత్సగా వాడుతున్నారు. ఇయితే ఇతర అనారోగ్య సమస్యలను ఉన్నవారు మాత్రం వైద్యులను సంప్రదించిన తర్వాతే పైనాపిల్‌ను తినాలి.

తరవాత కథనం