Weight Loss Medicine: ఇండియా మొత్తం ఎప్పట్నుంచో వెయిట్ చేస్తున్న.. వెయిట్‌లాస్ మెడిసిన్ దేశంలో అందుబాటులోకి వచ్చేసింది. డయాబెటిస్‌తో పాటు ఊబకాయాన్ని తగ్గించడంలో.. గ్లోబల్ బెస్ట్ సెల్లర్‌గా ఉన్న మందుని అమెరికాకు చెందిన ఎలీ లిల్లీ కంపెనీ మౌంజారో పేరిట భారత్‌లోకి తీసుకొచ్చింది. దీంతో.. అధిక బరువు, టైప్-2 డయాబెటిస్‌తో బాధపడుతున్న వారికి భారీ ఊరట దక్కనుంది. ఈ రెండు సమస్యలతో బాధపడుతున్న వాళ్లందరికీ.. ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మన దేశంలో మౌంజారో పేరిట ఈ మెడిసిన్ లభ్యమవుతుంది. దీనికి.. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ కూడా అనుమతి మంజూరు చేసింది.
ఊబకాయం, మధుమేహం చికిత్సలో ఎంతో ప్రభావవంతగా పనిచేసే ఈ మౌంజారో మెడిసిన్.. ఇప్పటికే అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో అందుబాటులో ఉంది. దీని కోసం భారత్ ఎప్పట్నుంచో ఎదురుచూస్తోంది. ఇప్పుడది తొలిసారి అందుబాటులోకి రావడంతో అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మౌంజారో మెడిసిన్.. సింగిల్ డోస్ బాటిల్‌లో దొరుకుతుంది. ఇది రక్తంలో షుగల్ లెవెల్స్‌ని, జీవక్రియని కంట్రోల్ చేస్తుంది. దాంతో.. బరువు తగ్గేందుకు, డయాబెటిస్‌ని అదుపులో ఉంచేందుకు సహాయపడుతుంది. ఈ మెడిసిన్ తీసుకున్న వారిలో మంచి ఫలితాలు కనిపించాయని చాలా రీసెర్చ్‌ల్లో తేలింది. ఇప్పుడు.. ఇండియాలోనూ అధిక బరువు, డయాబెటిస్ సమస్యని తగ్గించేందుకు.. తాము కట్టుబడి ఉన్నామని ఎలీ లిల్లీ సంస్థ తెలిపింది.
మౌంజారో మెడిసిన్.. 2.5ఎంజీ వయల్ ధర 3 వేల 500గా ఉండనుంది. అదే.. 5ఎంజీ ధర 4 వేల 375గా ఉండనుంది. దీనిని.. వారానికోసారి ఇంజెక్షన్ రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఈ లెక్కన.. నెలకు కనీసం 14 వేల నుంచి 17 వేల 500 వరకు ఖర్చవుతుంది. ఇదే డ్రగ్‌ని.. బ్రిటన్, యూరప్ దేశాల్లో ఎప్పటి నుంచే వాడుతున్నారు. అమెరికాలో దీనిని.. జెఫ్‌బౌండ్ పేరుతో అమ్ముతున్నారు. ఈ మౌంజారో మెడిసిన్.. జీఐపీ, జీఎల్‌పీ-1 హోర్మన్ గ్రాహకాలను ఉత్తేజపరుస్తుంది. దాంతో.. డయాబెటిస్, బరువు సమస్యలు తగ్గుతాయి.
ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. మన దగ్గర ఊబకాయం, అధిక బరువు, టైప్-2 డయాబెటిస్ లాంటి సమస్యలు చాలా మందిలో ఎక్కువ అవుతున్నాయి. దాదాపు 10 కోట్ల మంది ఈ సమస్యలతో బాధపడుతున్నారనే అంచనాలున్నాయి. అధిక బరువుతో డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది. దాంతో పాటు హైపర్ టెన్షన్, గుండె జబ్బులు, నిద్రలేమి లాంటి ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి.. ఈ మౌంజారో డ్రగ్ ఎంతోమందికి ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు.
మౌంజారో మెడిసిన్‌కి సంబంధించి.. బేరియాటిక్, రోబెటిక్ సర్జన్ డాక్టర్ వేణుగోపాల్ పరేఖ్ కూడా ముఖ్య విషయాల్ని చెప్పారు. ఈ మెడిసిన్‌ని.. 6 నెలల పాటు వాడితే.. దాదాపు 20 శాతం బరువుని తగ్గించుకోవచ్చన్నారు. డయాబెటిస్ కూడా బాగా కంట్రోల్ అవుతుందన్నారు.