virat kohli- IPL 2025: విరాట్ కోహ్లీ ముందు భారీ రికార్డులు.. మొత్తం ఎన్నో తెలుసా?

ఐపీఎల్ 2025 ప్రారంభమైంది. కోల్ కతా వర్సెస్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ జరుగుతోంది. అయితే ఈ ఐపీఎల్ 2025 సీజన్‌లో ఆర్సీబీ లెజెండ్ విరాట్ కోహ్లీ అదిరిపోయే భారీ రికార్డులను సొంతం చేేసుకోనున్నాడు. ఇప్పటికే ఈ లీగ్‌లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్ గా 8004 పరుగులతో ముందువరుసలో ఉన్నాడు. ఇక ఇప్పుడు ఈ సీజన్‌లో మరెన్నో కొత్త రికార్డులను తన ఖాతాలో వేసుకోవాలని అనుకుంటున్నాడు. దాదాపు ఐదు కొత్త రికార్డులను తన ముందు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

కోహ్లీ ముందు 5 రికార్డులు

400 T20 మ్యాచ్:

కోహ్లీ తన T20 క్రికెట్‌లో 400వ మ్యాచ్ ఆడుతున్నాడు. కెకెఆర్‌ మ్యాచ్‌తో ఇది తీరబోతోంది. మొదటి ప్లేస్‌లో రోహిత్ శర్మ (448) ఉన్నాడు. ఆ తర్వాత ప్లేస్‌లో దినేష్ కార్తీక్ (412) ఉన్నాడు. మూడో స్థానంలో 400 లేదా అంతకంటే ఎక్కువ T20 మ్యాచ్‌ల్లో ఆడిన మూడవ భారతీయుడిగా కోహ్లీ నిలవనున్నాడు.

114 పరుగులు చేస్తే:

ఐపీఎల్ 2025 లో కోహ్లీ ముందు మరో రికార్డు ఉంది. ఇప్పటి వరకు కోహ్లీ 399 మ్యాచ్‌లు ఆడాడు. అందులో మొత్తం 12886 పరుగులు చేశాడు. దీంతో ఇంకో 114 పరుగులు చేస్తే అతడు 13000 T20 పరుగులు సాధిస్తాడు. దీంతో ఇంత భారీ రన్స్ సాధించిన మొదటి భారతీయుడిగా కోహ్లీ రికార్డు సృష్టించనున్నాడు.

3హాఫ్ సెంచరీలు:

కోహ్లీ ఐపీఎల్ 2025లో 100 హాఫ్ సెంచరీలు చేరుకోవడానికి దగ్గరలోనే ఉన్నాడు. ప్రస్తుతం 97 హాఫ్ సెంచరీలు చేశాడు. ఇంకో మూడు హాఫ్ సెంచరీలు సాధిస్తే.. అతడు 100 అర్థ సెంచరీలు చేసిన ప్రపంచంలో రెండవ ఆటగాడిగా నిలుస్తాడు. ఫస్ట్ ప్లేస్‌లో డేవిడ్ వార్నర్ (108) ఉన్నాడు.

నాలుగు 50+ స్కోర్లు:

కోహ్లీ ముందు మరో భారీ రికార్డు ఉంది. IPL చరిత్రలో అత్యధిక ఫిఫ్టీ ప్లస్ ఇన్నింగ్స్‌ చేసిన ప్లేయర్‌‌గా నిలవడానికి మరో నాలుగు ఫిఫ్టీ ప్లస్ స్కోర్ చేస్తే చాలు. ప్రస్తుతం కోహ్లీ 63.. ఫిఫ్టీ ప్లస్ స్కోర్‌లతో సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు

28 సిక్సర్లు:

IPLలో కోహ్లీ 300 సిక్సర్లు సాధించడానికి ఇంకా 28 సిక్సర్లు అవసరం. ప్రస్తుతం అతడు 272 సిక్సర్లతో 3వ ప్లేస్‌లో ఉన్నాడు.

తరవాత కథనం