Benefits of Makhana: ఫూల్‌ మఖానా… పోషకాల ఖజానా.. తింటే ఎన్ని లాభాలో..

Benefits of Makhana:

Benefits of Makhana: తామర గింజలు.. వీటినే పూల్ మఖానా అని కూడా అంటారు. మఖానాతో రుచికరమైన వంటలు తయారు చేసుకోవచ్చు. భారతీయులు దీంతో చేసిన వంటలు ఇష్టంగా తింటుంటారు. బీహార్‌లో ఎక్కువగా ఈ మఖానాను పండిస్తారు. ఇది తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. మఖానాలో కొవ్వు తక్కువగా ఉండి, మంచి యాంటీ ఆక్సీడెంట్లు ఉండటంతో ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇంతేకాదు గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.

మఖానాలో తక్కువ కాలరీలు, ఎక్కువ పోషకాలు ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఉత్తమమైన ఆహారం. ప్రొటీన్లు సమృద్ధిగా మఖానా ప్రొటీన్లకు మంచి కాబట్టి కండరాలకు బలం అందిస్తుంది. చక్కెరస్థాయిలను నియంత్రిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారికి ఇది మంచి ఆహారంగా పనిచేస్తుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటంతో జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

మఖానాలో గుణకారమైన యాంటీఆక్సీడెంట్లు ఉండటంతో మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. కొందరు వయస్సు ఎంత పెరిగినా యవ్వనంగానే కనిపిస్తుంటారు. అలా కనిపించడానికి జీన్స్, మంచి డైట్ కూడా కారణం కావచ్చు. అయితే యవ్వనంగా, చర్మం ముడతలు లేకుండా కనిపించడానికి డైట్‌లో మఖానాను చేర్చుకుంటే.. మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా దీనివల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుందాం.

వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యీసిడ్స్, యాంటీ ఆక్సీడెంట్లు, విటమిన్ ఎ, జింక్ వంటి ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి ముఖంపై ముడతలు, మచ్చలు తగ్గించడంలో సహాయపడతాయి.

మఖానా, బెల్లం కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీనివల్ల శరీరానికి విటమిన్ బి, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. మఖానాలో కాల్షియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. ఇది ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. బెల్లం ఎముకల అభివృద్ధిని ప్రోత్సహించే ఇనుము, ఖనిజాలను కలిగి ఉంటుంది.

తరవాత కథనం