kidneys healthy: ఆరోగ్యకరమైన కిడ్నీ కోసం వీటికి దూరంగా ఉండండి..!

కిడ్నీ ఆరోగ్యంగా ఉండేందుకు చాలామంది చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మూత్రపిండాలు శరీరంలోని రక్తాన్ని శుభ్రపరచడానికి, ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుకోవడానికి పని చేస్తాయి. ఆరోగ్యకరమైన మూత్రపిండాలు అవసరమైన హార్మోన్లను పెంచుతాయి. ఆరోగ్యంగా ఉండటం వల్ల కడుపు సంబంధిత సమస్యలు తగ్గుతాయి. దీన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, పౌష్టిక ఆహారం, వ్యాయామం చాలా అవసరం. అందువల్లనే కిడ్నీని ఎంతో జాగ్రత్తగా ఉంచుకోవాలని వైద్యులు చెబుతున్నారు. మరి కిడ్నీ సేఫ్‌గా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం.

ధూమపానంకు దూరం

ధూమపానం మీ మూత్రపిండాలను చికాకుపెడుతుందని వైద్యులు అంటున్నారు. ధూమపానం కిడ్నీ క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా రెట్టింపు చేస్తుంది. ధూమపానం రక్తపోటును పెంచుతుంది. శరీరంలో కొవ్వు పేరుకుపోవడానికి కూడా కారణమవుతుంది.

ప్రాసెస్ చేసిన ఆహారాలు

ప్రాసెస్ చేసిన ఆహారం, షుగర్ మీ మూత్రపిండాలకు చాలా హానికరం. ప్రాసెస్ చేసిన ఆహారాలలో చక్కెర, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు, అనారోగ్యకరమైన కొవ్వులు, అధిక సోడియం ఉంటాయి. ఫైబర్, ప్రోటీన్, అవసరమైన పోషకాలు తక్కువగా ఉంటాయి. ఇలాంటి ఆహారం తీసుకునే వారికి కిడ్నీ వ్యాధి వచ్చే ప్రమాదం 24 శాతం ఎక్కువ.

నిద్ర లేకపోవడం

తగినంత నిద్ర లేకపోతే అది మూత్రపిండాలను శాశ్వతంగా బలహీనపరుస్తుంది. శరీరానికి విశ్రాంతి ఇవ్వాలంటే నిద్ర అవసరం. కిడ్నీ పనితీరు స్లీప్-వేక్ సైకిల్ ద్వారా నియంత్రించబడుతుంది. ఇది 24 గంటల వ్యవధిలో మూత్రపిండాల పనితీరును సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.

తరవాత కథనం