Sikandar Movie: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నజంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సికిందర్. ఎ ఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఇక ఈ అవైటెడ్ మూవీలో సత్యరాజ్, శర్మాన్ జోషి, ప్రతీక్ బబ్బర్ వంటి ప్రముఖులు ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు. అయితే మాస్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రంపై అభిమానులతో పాటు సినీ వర్గాల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ టీజర్స్ సాలిడ్ రెస్పాన్స్ దక్కించుకున్నాయి. కాగా ఉగాది, రంజాన్ పండగల కానుకగా మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీ సెన్సార్ పనులు కూడా పూర్తయ్యాయి. ఈ సినిమా ఎలాంటి కట్స్ లేకుండా విడుదలవుతుండడం గమనార్హం.
ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ ప్రక్రియ శుక్రవారం తో పూర్తయింది. థియేటర్లలో విడుదల కానున్న ఈ ట్రైలర్ నిడివి 3 నిమిషాల 38 సెకన్లు. ఇక సినిమా నిడివి 150.8 నిమిషాలు. అంటే 2 గంటల 30 నిమిషాల పాటు మూవీ ఉంటుంది. ఇక సికందర్ చిత్రానికి U/A సర్టిఫికెట్ లభించింది, అంటే 13 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు దీనిని చూడవచ్చు..
‘సికందర్’ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ రష్మిక మందన్నా. ఇటీవల ఆమె నటించిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. . ఇప్పుడు, ఈ సినిమా కూడా హిట్ అవ్వాలని రష్మిక అభిమానులు కోరుకుంటున్నారు.