SSH Vs RR: హిస్టరీ క్రియేట్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. తొలి జట్టుగా రికార్డు

2025లో జరుగుతున్న ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్)లో రెండో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడ్డాయి. ఇవాళ (మార్చి 23న) రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇరు జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన తర్వాత రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఓపెనర్స్‌గా క్రీజ్‌లోకి వచ్చారు. ఈ ఇద్దరు బ్యాటర్లు ఆర్‌ఆర్ బౌలర్లను ప్రారంభం నుండే కంగారు పెట్టించారు. పవర్‌ప్లేలో వారి అద్భుతమైన ప్రదర్శనతో సన్‌రైజర్స్ హైదరాబాద్ చరిత్ర సృష్టించింది. ఆ జట్టు ఈ ఇన్నింగ్స్‌లోని మొదటి 10 ఓవర్లలో మొత్తం 135 పరుగులు చేసింది.

దీంతో ఐపీఎల్‌లో మొదటి 10 ఓవర్లలో 135 పరుగులు సాధించిన తొలి జట్టుగా హైదరాబాద్ నిలిచింది. 2014 నుండి ముంబై ఇండియన్స్ 120 పరుగులతో రెండవ స్థానంలో ఉంది. 2022లో KKR 116 పరుగులతో మూడవ స్థానంలో ఉంది.

మ్యాచ్ విషయానికొస్తే.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతమైన ఆటతీరు కనబరిచింది. ఫోర్లు, సిక్సర్లతో దుమ్ముదులిపేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 24 పరుగులతో ఔటయిన తర్వాత.. ట్రావిస్ హెడ్ 31 బంతుల్లో 67 పరుగులు చేశాడు. నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ వరుసగా 30, 34 పరుగులు చేశారు. ఇంకా ఇషాన్ కిషన్ సెంచరీతో.. హైదరాబాద్ జట్టు రాజస్థాన్ జట్టు కోసం భారీ స్కోరును నమోదు చేసింది.

దీంతో తొలి ఛాంపియన్స్‌గా ఉన్న రాజస్తాన్ రాయల్స్ ముందు పెద్ద టార్గెట్‌ ఉందని చెప్పాలి. రెండవ ఇన్నింగ్స్‌లో ఆర్ఆర్ మొత్తం 287 పరుగులను ఛేదించాలి. ఇషాన్ కిషన్ తన ఇన్నింగ్స్‌ను 106 పరుగులతో ముగించాడు.

IPLలో 10 ఓవర్ల తర్వాత రాజస్థాన్ రాయల్స్‌పై అత్యధిక స్కోరు

135/2 – SRH, హైదరాబాద్, 2025

120/4 – MI, ముంబై, 2014

116/2 – KKR, ముంబై, 2022

115/1 – SRH, హైదరాబాద్, 2019

115/3 – DC, ఢిల్లీ, 2024

తరవాత కథనం