మెగా ఫ్యామిలీ నుంచి మరో భారీ బడ్జెట్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా పవర్ ఫుల్ చిత్రం రూపొందుతోంది. విరూపాక్ష మూవీతో ఈ హీరో కంబ్యాక్ అయ్యాడు. ఈ చిత్రం ఎనలేని ప్రేక్షక ఆదరణ సంపాదించుకుంది. భారీ వసూళ్లను సైతం రాబట్టింది. ఈ సినిమా తరువాత సాయి తేజ్ బ్రో మూవీతో వచ్చి ప్రేక్షకులను అలరించాడు.
ఇందులో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించడంతో మూవీ మరింతగా ప్రేక్షలను ఆకట్టుకుంది. ఈ రెండు చిత్రాలతో వసూళ్ల వర్షం కురిపించిన సాయి ధరంతేజ్ ఇప్పుడు మరొక భారీ యాక్షన్ సినిమాతో వచ్చేస్తున్నాడు. రోహిత్ దర్శకత్వంలో సంబరాల ఏటిగట్టు అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.
ఇందులో సాయి తేజ్ సిక్స్ ప్యాక్ లుక్ తో అదిరిపోయాడు. దాదాపు 120 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందుతున్నట్లు తెలుస్తోంది. హనుమాన్ సినిమా ఫేమ్ నిర్మాత నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. పాన్ ఇండియా లెవెల్‌లో వస్తున్న ఈ సినిమాలో పెద్ద పెద్ద సీనియర్ యాక్టర్స్ నటిస్తున్నారు. అందులో శ్రీకాంత్ ఒకరు.
ఎన్నో సినిమాల్లో హీరోగా చేసిన శ్రీకాంత్.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్‌తో అదరగొడుతున్నాడు. నెగిటివ్, పాజిటివ్ రోల్స్ తో పిచ్చెక్కిస్తున్నాడు. ఇప్పుడు ఆయన సాయి తేజ్ మూవీలో భాగమయ్యాడు. ఇందులో శ్రీకాంత్ సరికొత్త డిఫరెంట్ పాత్రలో నటిస్తున్నాడు. ఇవాళ శ్రీకాంత్ బర్తడే. ఈ సందర్భంగా మూవీ యూనిట్ అదిరిపోయే సర్ప్రైజ్ అందించింది.
సంబరాల ఏటిగట్టు సినిమా నుంచి పవర్ఫుల్ లుక్కును రిలీజ్ చేసింది. అందులో శ్రీకాంత్ అవతారం చూస్తే ఒళ్ళు గగుల్ పుట్టాల్సిందే. అలా ఉన్నాడు ఈ లుక్కులో. కాగా ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి జగపతిబాబు, సాయికుమార్ ఫస్ట్ లుక్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. చూడాలి మరి ఇందులో ఇంకా ఎంతమంది నటీనటులు భాగమయ్యారా అనేది.