బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు హిట్టుపడి చాలా ఏళ్లు అయింది. ఇందులో భాగంగానే వరుస సినిమాలు చేస్తున్నాడు. కానీ ఏ చిత్రం కూడా అతడికి సరైన కబ్యాక్ అందించలేదు. కానీ అతడు తన ప్రయత్నాన్ని ఆపలేదు. వరుసగా ఏడాదికి ఒక సినిమా చేస్తూ అలరిస్తున్నాడు. ఇందులో భాగంగానే ఈ ఏడాది మరో సినిమాతో ప్రేక్షకులను అభిమానులను అలరించడానికి సిద్ధమయ్యాడు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సికిందర్ అనే మూవీ చేస్తున్నాడు.
ఈ సినిమాలో సల్మాన్ పవర్ఫుల్ లుక్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు టీజర్ సాంగ్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. పైగా చాలా ఏళ్ల తర్వాత సల్మాన్ ఒక సౌత్ డైరెక్టర్ తో సినిమా చేస్తుండడంపై అంచనాలు మరింత పెరిగాయి. ఇందులో సల్మాన్ సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది.
కాజల్ అగర్వాల్, సత్యరాజ్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఎన్నో అంచనాలతో ఈనెల అంటే మార్చ్ 30న ఉగాది సందర్భంగా ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా అదిరిపోయే సర్ప్రైజ్ అందించారు. ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌లో సల్మాన్ ఖాన్ పవర్ ఫుల్ మాస్ లుక్ లో కనిపించి అభిమానులకు ట్రీట్ అందించాడు.
ఫుల్ లెన్త్ యాక్షన్ సన్నివేశాలతో ట్రైలర్ అదిరిపోయింది. ఓవైపు మాస్ సన్నివేశాలు.. మరోవైపు రొమాంటిక్ లవ్ సీన్లతో ట్రైలర్ రిలీజ్ అయింది. ముఖ్యంగా విఎఫ్ ఎక్స్ జోలికి పోకుండా.. రియాలిటీగా చూపించి అదరగొట్టేసారు. ఈ ట్రైలర్‌తో సల్మాన్ మళ్లీ పాత లుక్ ను గుర్తు చేశాడు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ట్రైలర్ చూసి ఎంజాయ్ చేయండి.