Robinhood: రాబిన్ హుడ్ ప్రమోషన్స్.. శ్రీలీలతో డేవిడ్ వార్నర్

Robinhood

Robinhood: రాబిన్‌ హుడ్ మూవీలో నటించడం గౌరవంగా భావిస్తున్నానని స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ తెలిపాడు. ఆదివారం హైదరాబాద్‌లో మేకర్స్ ప్రీ రిలీజ్, ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. వార్నర్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యాడు. సినిమా చాలా అద్భుతంగా ఉందని, డెఫినెట్‌గా సక్సెస్ అవుతుందని తెలిపాడు.

హీరో నితిన్ మాట్లాడుతూ.. ఆర్ డైరెక్టర్ రామ్ కుమార్ గారు, ఎడిటర్ కోటి, డిఓపి సాయి శ్రీరామ్ ఈ ముగ్గురు చాలా అద్భుతమైనటువంటి వర్క్ ఇచ్చారు. జీవీ ప్రకాష్ కుమార్. వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ఆల్రెడీ సాంగ్స్ పెద్ద హిట్ అయ్యాయి. సినిమా చూస్తున్నప్పుడు మీరే చెప్తారు. ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. మార్చి 28న మీరు చూస్తారు. ఇది నాకు శ్రీలీలకి సెకండ్ మూవీ. రాబిన్‌హుడ్‌పై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నామని, సినిమాని అందరూ ఎంజాయ్ చేస్తారని చెప్పాడు.

ఈ సినిమా డెఫినెట్ గా ఆడుతుంది. మా ఇద్దరికీ హిట్ పెయిర్ అనే పేరు వస్తుంది. ఈ సినిమా అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇండియాలో మైత్రి ఈరోజు టాప్ ప్రొడక్షన్ హౌస్. సినిమాని చాలా భారీగా తీశారు. దేవుడిచ్చిన తమ్ము వెంకీ. నామీద తనకి ఎంత ప్రేమ ఉందో ఈ సినిమాతో చూపించాడు. మార్చి 28న అది మీరు విట్నెస్ చేస్తారు. క్రికెట్ లెజెండ్ డేవిడ్ వార్నర్ భాయ్ ప్రజెన్స్ తో ఈ సినిమా మరో లెవల్ కి వెళ్ళింది. వార్నర్ క్రికెట్ లో ఎంత ఉత్సాహంగా ఉంటారో సినిమాలో కూడా అంతా ఉత్సాహంగా కనిపిస్తారు. ఇందులో అతని కామియో చిన్నదైనా చాలా ఇంపాక్ట్ ఫుల్ గా ఉంటుంది. సినిమాకి ఒక హై ఇస్తుంది. సినిమా ఖచ్చితంగా మీ అందరినీ అలరిస్తుంది’అన్నారు.

హీరోయిన్ శ్రీల మాట్లాడుతూ.. తాను అనుకోకుండా చేసిన ఈ సినిమా, అనుకున్న దానికంటే చాలా అద్భుతంగా వచ్చిందని హీరోయిన్ శ్రీలీల తెలిపింది. డేవిడ్ వార్నర్ గారిని బ్యాటింగ్లో చూసాం కానీ నాకు షూటింగ్లో చూసే అవకాశం వచ్చింది.ఈ సినిమాని ఆడియన్స్ అందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు అని తెలిపింది.

డైరెక్టర్ వెంకీ కుడుముల మాట్లాడుతూ, నిర్మాత రవి నమ్మకం వల్లనే డేవిడ్ వార్నర్ ప్రాజెక్ట్‌లోకి వచ్చారని చెప్పాడు. ఈ రోల్ యాక్సెప్ట్ చేసిన ఆయనకు ధన్యవాదాలు తెలిపాడు. శ్రీలీల అంత బిజీగా ఉన్నప్పుడు కూడా నామీద నమ్మకంతో ప్రాజెక్టులోకి రావడం చాలా ఆనందంగా అనిపించింది. ఈ నెల 28న ఈ మూవీ విడుదల అవుతున్నది. కేతిక శర్మ స్పెషల్ సాంగ్‌లో నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.

డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ మాట్లాడుతూ… వెంకీ తన సినిమాని చాలా అద్భుతంగా ప్రమోట్ చేస్తున్నారు. ప్రమోషన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. తెలుగు సినిమా స్ట్రెంత్ ఎంటర్టైన్మెంట్ వెంకీ అలాంటి ఎంటర్టైన్మెంట్ తీసే దర్శకుడు. తను ఆల్రెడీ రెండు సినిమాలతో ప్రూవ్ చేశాడు. నితిన్ వెంకి కాంబినేషన్లో ఈ సినిమా మరో సూపర్ సక్సెస్ అవుతుందని, ఈ సినిమా థియేటర్స్ అదరగొట్టేస్తుందని నమ్ముతున్నాను’అన్నారు .

మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ మాట్లాడుతూ.. ఇది స్టైలిష్ కమర్షియల్ ఎంటర్టైనర్. వెంకీ కుడుముల గత రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ . ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ కాబోతుంది. హై ఎనర్జీ ఎంటర్టైన్మెంట్. మ్యూజిక్ ఉండే రాకింగ్ ఫిల్మ్ ఇది. మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అందరూ ఎంజాయ్ చేస్తారు’అన్నారు. మూవీ యూనిట్ అంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

తరవాత కథనం