Anchor Shyamala: చేసింది తప్పే! క్షమించండి.. యాంకర్ శ్యామల ఫస్ట్ రియాక్షన్

Anchor Shyamala

Anchor Shyamala: బెట్టింగ్ యాప్స్ కేసులో విచారణకు రంగం సిద్ధమైంది. నేటి నుంచి ముమ్మరంగా విచారణ జరగనుంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఇవాళ నటి శ్యామల విచారణకు ముగిసింది. దాదాపు మూడున్నరగంటల పాటు ప్రశ్నించారు పంజాగుట్ట పోలీసులు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కు ఎంత తీసుకున్నారనే దానిపై ఆరా తీశారు. పోలీసుల విచారణకు సహకరిస్తానన్నారు శ్యామల.. ఎప్పుడు విచారణకు పిలిచిన హాజరవుతారన్నారు.

కాగా రేపు మరోసారి విష్ణు ప్రియ, రీతూ చౌదరిని ప్రశ్నించనున్నార పోలీసులు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన 11 మందిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వీరిలో ఇప్పటి వరకు టేస్టీ తేజ, కానిస్టేబుల్ కిరణ్, విష్ణు ప్రియ, రీతూ చౌదరిలను పోలీసులు విచారించారు. సన్నీ, అజయ్, సుధీర్ కూడా ఎప్పుడైనా విచారణకు హాజరయ్యే అవకాశముంది.

ఇదిలా ఉంటే హర్ష సాయి, ఇమ్రాన్ ఇంకా పోలీసులకు అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది. అటు మియాపూర్ కేసులో మొదట బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు, మధ్యవర్తులను విచారించే అవకాశముంది.

సినీ సెలబ్రెటీలు, స్టార్ క్రికెటర్లు, సోషల్ మీడియా ఇన్​ఫ్లుయెన్సర్లు.. వీళ్లకున్న గుర్తింపుతో ప్రజలను విపరీతంగా ఆకట్టుకోగలరు. ఎంతగా అంటే.. వాళ్లు ఏది చెప్పినా అది కరెక్ట్​ అనుకునేంతలా. ఇది అదనుగా తీసుకున్న బెట్టింగ్ యాప్ నిర్వహకులు, వాళ్లతో ప్రమోషన్లు చేయిస్తున్నారు.

ఇదంతా పక్కన పెడితే.. వాళ్లను నమ్మి బెట్టింగ్ యాప్లలో డబ్బులు పెట్టి నష్టపోయినవాళ్లు అప్పులపాలయ్యారు. తెలంగాణలోనే ఏడాదిలో వంద కోట్లకు పైగా నష్టపోయినట్టు అంచనా. ఆ అప్పులు తీర్చలేక, ఇంట్లోవాళ్లకు చెప్పుకోలేక మానసిక వేదనతో ఆత్మహత్యాయత్నాలు చేస్తున్నారు కొందరు. ఇప్పటికే ఒక్క హైదరాబాద్​లోనే దాదాపు పది మంది ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు.

తరవాత కథనం