Benefits Of Banana: అరటిపండు ఆరోగ్యానికి మేలు చేస్తుందని అందరికి తెలుసు. ఖచ్చితంగా ఇది నిజం. కానీ ఆరోగ్యానికి మేలు చేయాలంటే సరైన సమయంలో తినడం ముఖ్యం. వైద్యులు కూడా ఇదే సూచిస్తారు. ఎందుకంటే కొన్ని సమయాల్లో శరీరానికి హాని కలగవచ్చు. అందుకే సరైన సమయంలో తినడం అలవాటు చేసుకోవాలి. అయితే ఏ సమయంలో అరటిపండు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
రాత్రి సమయంలో అరటిపండు దూరంగా ఉండటం మంచిది. అరటిలో ఐరన్, విటమిన్ బి6, బి, ఫైబర్, మెగ్నీషియం, కాల్షియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇది ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు చేకూరుస్తాయి. అరటిలో పెద్ద మొత్తంలో పోషకాలు ఉంటాయి. ఇవి శక్తిని ఇస్తాయి. కానీ ఇవి మీ శరీరం రాత్రిపూట విశ్రాంతి అడుగుతుంది. అరటిపండు తింటే మీకు శక్తి వస్తుంది కానీ నిద్ర మాత్రం రాదు. ఆయుర్వేదం ప్రకారం జలుబు, దగ్గు ఉన్నవాళ్లు తినకూడదు.
అరటిపండు ఉపయోగాలు..
అరటిపండ్లు తియ్యగా ఉన్నప్పటికీ.. తక్కువ కేలరీలు కలిగి ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. దీని వల్ల ఎక్కువగా తినకుండా నియంత్రించవచ్చు. బరువు తగ్గేందుకు ఇది అద్బుతంగా పనిచేస్తుంది.
పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉన్న అరటిపండ్లు తింటే శరీరంలో ఎముకల బలోపేతానికి తోడ్పడతాయి. కాల్షియం నష్టాన్ని తగ్గించి ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
అరటిపండ్లు విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా కలిగి ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించి ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
అరటిపండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఇందులోని పెక్టిన్, రెసిస్టెంట్ స్టార్చ్ ప్రేగుల కదలికలను సరిగ్గా ఉంచడం, మలబద్ధకాన్ని తగ్గించడం, ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచడంలో తోడ్పడతాయి. ఆరోగ్యకరమైన జీర్ణక్రియ కోసం ఇది చాలా మంచిది.
విటమిన్ సి, బి6 అధికంగా ఉండే అరటిపండ్లు యవ్వనంగా కనిపించేలా సహాయపడతాయి. అరటిపండుతో ఫేస్ మాస్క్‌లు ట్రే చేశారంటే.. చాలా అందంగా కనిపిస్తారు.