ఇండస్ట్రీలోకి వచ్చి కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు నటుడు సుహాస్. హీరో ఫ్రెండ్ రోల్‌లో ఎక్కువగా కనిపించాడు. అలా తన నటనతో సినీ ప్రియుల్లో తనదైన ముద్ర వేసుకున్నాడు. ఆ తర్వాత నెగెటివ్ రోల్స్ చేసి మరింత ఎదిగిపోయాడు. దీంతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు.
ఇలా వరుసగా సైడ్ రోల్స్ చేసుకుంటూ పోయిన సుహాస్‌కు హీరోగా చేసే అవకాశం వచ్చింది. కలర్ ఫొటో సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో సుహాస్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా ఒక్కో సినిమా చేసి మంచి హిట్లు అందుకున్నాడు. ఇప్పుడు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చిన్న హీరోల లిస్ట్‌లో ముందువరుసలో ఉన్నాడు.
ప్రస్తుతం సుహాస్ పలు సినిమాలతో దూసుకుపోతున్నాడు. అందులో ‘ఓ భామ అయ్యో రామ’ అనే సినిమా ఒకటి. ఈ సినిమా పై కూడా అందరిలోనూ మంచి అంచనాలు ఉన్నాయి. రామ్ గోదల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మాళవిక మనోజ్ హీరోయిన్ గా నటిస్తోంది. హరీశ్ నల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు మంచి రెస్పాన్స్ అందించాయి.
తాజాగా ఈ సినిమా టీజర్ ఈవెంట్‌ను మూవీ యూనిట్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా సుహాస్ పలు విషయాలు పంచుకున్నాడు. ఈ సినిమా స్టోరీ చాలా బాగుంటుంది అని అన్నాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో ట్విస్ట్ అదిరిపోతుందని చెప్పాడు. అయితే ఈ సినిమా టైటిల్ అర్థాన్ని దర్శకుడు రామ్ గోదల వివరించాడు. ఈ మూవీలో హీరో పేరు రామ్ అని.. హీరోయిన్ పేరు సత్య అని తెలిపాడు. అందువల్ల ఓ భామ అంటే ఒక అమ్మాయి అని.. అయ్యో రామ అంటే తన పరిస్థితులని అన్నాడు. ఈ సినిమా చూసిన తర్వాత అంతా మీకే అర్థం అవుతుందని చెప్పుకొచ్చాడు.