ఐపీఎల్ 2025 లో భాగంగా ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. లక్నో నిర్దేశించిన 210 పరుగులను ఛేదించింది. 1 వికెట్ తేడాతో చెమటలు పట్టించే విజయాన్ని నమోదు చేసింది. 19.3 ఓవర్లలో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఢిల్లీ బ్యాటర్ అశుతోష్ శర్మ (66*) అర్ధశతకంతో చెలరేగాడు. మొదట టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకుంది.
దీంతో లక్నో బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు మార్కరమ్, మార్ష్ దుమ్ము దులిపేశారు. ముఖ్యంగా నికోలస్ పూరన్ అదరగొట్టేశాడు. కేవలం 30 బంతుల్లో 75 పరుగులు చేసి ఔరా అనిపించాడు. కళ్లు చెదిరే షాట్లతో ఆశ్చర్యపరిచాడు. సమీర్ రిజ్వీ క్యాచ్ మిస్ చేయడంతో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. మిచెల్ మార్ష్ సైతం అబ్బురపరిచాడు.
36 బంతుల్లో 72 పరుగులు చేసి మెరిపులు మెరిపించాడు. మిచెల్ స్టార్క్ వేసిన మొదటి ఓవర్లలో సిక్స్‌తో ఖాతా ఓపెన్ చేశాడు. అదే జోరుతో మార్స్ దుమ్ముదులిపేశాడు. కేవలం 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి అబ్బుపరిచాడు. ఫోర్లు, సిక్సర్లతో హైపెక్కించాడు. గ్రౌండ్‌లో పరుగుల వరద కురిపించాడు. దూకుడుగా ఆడుతున్న క్రమంలో ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
మొత్తంగా లక్నో సూపర్ జెయింట్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. దీంతో లక్ష్య చేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. కేవలం 1 వికెట్ తేడాతో టార్గెట్ పూర్తి చేసింది. ఢిల్లీ జట్టులో అశుతోస్ చెలరేగిపోయాడు. వారెవా అనేలా దుమ్ము దులిపేశాడు. అశుతోష్ శర్మ (66*) అర్ధశతకంతో చెలరేగాడు. మొత్తంగా దిల్లీ 19.3 ఓవర్లలో విజయాన్ని ఖాతాలో వేసుకుంది