Benefits of Sesame Seeds: మన దేశంలో ప్రాచీన కాలం నుండి వాడుతున్న పాదార్దాలలో నువ్వులు ప్రధమ స్థానంలో ఉన్నాయి. నువ్వులు రుచిని మాత్రమే కాదు.. అపారమైన పోషకాలను అందిస్తాయి. నువ్వుల్లో ఉండే ససామిన్ అనే కాంపౌండ్ జాయింట్ నొప్పులను తగ్గించి మోకాలి ఆర్ధరైటిస్ లో మొబిలిటీని సపోర్ట్ చేస్తుంది. నువ్వుల ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
నువ్వుల్లో కార్బోహైడ్రేట్‌లు, విటమని ఎ, క్రొవ్వు పదార్దాలు, విటమిన్ బి1, బి6, బి12 , కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, జింక్ మొదలైన అధ్బుతమైన పోషకాలు ఉన్నాయి. నువ్వులు సాధారణంగా రెండు రకాలు.. నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు రెండూ కూడా ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనాలు చేకూరుస్తాయి. నువ్వుల నూనెలో ఒమేగా 6ఫాటీ యాసిడ్స్, ప్రొటీన్లు, యాంటీ ఆక్సీడెంట్లు సమృద్ధిగా ఉన్నాయి. వీటిలో తయారు చేసిన పదార్దాలు ఎక్కువకాలం నిల్వ ఉంటాయి.
మహిళల్లో హార్మోన్ల సమస్యకు నువ్వులు చక్కని పరిష్కారం. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో నువ్వులు ప్రయోజనకరమైన ఆహారపదార్ధంగా గుర్తించబడ్డాయి. అయితే నువ్వులను పరిమితి మించి తీసుకుంటే చక్కెర స్థాయిలు అనూహ్యంగా తగ్గి ప్రమాదాన్ని కలిగిస్తాయి. అధిక రక్త పోటు ఉన్న వాళ్లు వీటిని తీసుకుంటే.. రక్తపోటు స్థాయిలు క్రమంగా తగ్గుతాయి. రోజూ కాస్త నువ్వులను ఆహారంలో చేర్చుకునే వారికి కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. ఫలితంగా గుండె జబ్బులనుంచి రక్షణ కలిగిస్తుంది. నువ్వుల్లో మేలు చేసే పోషకాలు ఉండటమే ఇందుకు కారణం అని వైద్య నిపుణులు చెబుతున్నారు.
మమూలు నువ్వుల కంటే.. వేయించనవి తింటే.. మాంసకృత్తులు పుష్కలంగా అందుతాయి. ముఖ్యంగా కండరాల బలానికి, హార్మోన్లు చురుగ్గా ఉండటానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. నల్ల నువ్వును రోజుకు రెండు గ్రాములను తీసుకున్న.. గుండె కవటాలు మూసుకుపోయే సమస్య కొంత వరకు ఉపశమనం వస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఇవి వ్యాధినిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మధుమేహం, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి కాపాడటంలో చక్కగా పనిచేస్తాయి. నువ్వుల్లో పీచు పదార్దం ఎక్కువ. ఇందువల్ల అరుగుదల బాగుంటుంది.