టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ తండ్రి అయ్యాడు. అతడి భార్య అతియా శెట్టి పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఇదే విషయాన్ని రాహుల్ అండ్ అతియా తమ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అదే సమయంలో వారికి పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్ తన భార్య అతియా శెట్టి కలిసి తమ ముద్దుల కూతురును పట్టుకొని ఉన్నట్లు ఓ ఫోటో వైరల్ గా మారింది. దీంతో ఆ ఫోటో చూసి రాహుల్ అభిమానులు, క్రికెట్ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కంగ్రాట్స్ రాహుల్ అండ్ అతియా అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు పాప చాలా క్యూట్ గా ఉందని చెబుతున్నారు. అయితే ఆ ఫోటో ఫేక్ అని తాజాగా తేలింది.
రాహుల్ ఆడబిడ్డకు తండ్రి అయ్యాడు కానీ పాప ఫోటో ఇప్పటివరకు సోషల్ మీడియాలో పంచుకోలేదని తెలిసింది. అది ఒక ఫేక్ ఏ ఐ జనరేటెడ్ ఫోటో అని నిర్ధారించబడింది. ఆ ఫోటో చూడ్డానికి అచ్చం ఒరిజినల్ ఫోటోలా ఉండటంతో చాలామంది తడబడ్డారు. అది నిజమైనా ఇమేజ్ అనుకొని తెగ షేర్ చేసేస్తున్నారు. కానీ ఆ ఫోటో ఏఐ జనరేటర్ అని తెలిసి షాక్ అయ్యారు.
ఫేక్ అని ఎలా చెప్పొచ్చు..
ఆడబిడ్డ జన్మించిన తరువాత కె.ఎల్ రాహుల్ కానీ అతడి భార్య గాని సోషల్ మీడియాలో ఎలాంటి ఫోటో ను షేర్ చేసుకోలేదు.
అంతేకాకుండా కేఎల్ రాహుల్ మామ, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూడా సోషల్ మీడియాలో ఎలాంటి ఫోటోను పంచుకోలేదు.
కేఎల్ రాహుల్ ఇటీవల ఛాంపియన్ ట్రోఫీలో జులపాల జుట్టుతో కనిపించాడు. కానీ ఈ ఫోటోలో మాత్రం హెయిర్ కట్ తో కనిపించడం విశేషం.
మూడు రోజుల క్రితం కేఎల్ రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్వహించిన ఈవెంట్ లోను జులపాల జుట్టుతోనే కనిపించాడు.
ఇక ఈ ఫోటోను సైట్ ఇంజిన్ అనే డిటెక్టర్ టూల్ లో వేసినప్పుడు 99 శాతం ఏఐ ఫోటో అని నిర్ధారించబడింది.
అయితే ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. కేఎల్ రాహుల్ కు ఆడబిడ్డ జన్మించడానికి నెలరోజుల ముందే ఈ తరహా ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.