టాలీవుడ్ నుంచి ఇటీవల వచ్చిన ఓ హిట్టు చిత్రం ఇప్పుడు ఓటిటిలోకి వచ్చేందుకు సిద్ధమైంది. సందీప్ కిషన్, రీతు వర్మ జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం మజాకా. చాలా గ్యాప్ తర్వాత సందీప్ కిషన్ ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో రావు రమేష్, అన్షు ప్రధాని పాత్రలు పోషించారు.
అలాగే మురళి శర్మ, అజయ్, హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, రఘుబాబు, సుప్రీత్ రెడ్డి సహా మరి ఎంతోమంది కీలకపాత్రలో నటించారు. ఫుల్ బజ్ తో కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం ఫిబ్రవరి 26న గ్రాండ్ లెవెల్ లో విడుదల అయింది. ఫస్ట్ షో నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇందులో సందీప్ కిషన్, రావు రమేష్ తండ్రి కొడుకుల పాత్రలో తమ కామెడీతో అదరగొట్టేసారు.
థియేటర్లో ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించారు. నవ్వుల బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. చాలా గ్యాప్ తర్వాత వచ్చిన సందీప్ కిషన్ మంచి హిట్టును నమోదు చేసుకున్నాడు. ఇలా పాజిటివ్ రెస్పాన్స్ తో థియేటర్ ఆడియన్స్ను అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటిటీ ప్రేక్షకుల కోసం వచ్చేస్తోంది.
ప్రముఖ ఓటిటీ స్ట్రీమింగ్ సంస్థ జి 5 ఈ సినిమా ఓటిటి హక్కులను దక్కించుకుంది. దీంతో ఒప్పందం ప్రకారం ఉగాది సందర్భంగా మార్చి 28 నుంచి జీ 5లో స్ట్రీమింగ్ కానుంది. ఆల్రెడీ ఈ స్ట్రీమింగ్ సంస్థలో సంక్రాంతి వస్తున్నాం, మ్యాక్స్ వంటి చిత్రాలు దూసుకుపోతున్నాయి. వాటితో పాటుగా త్వరలో స్ట్రీమింగ్ కాబోతున్న మజాకా చిత్రం కూడా మంచి రెస్పాన్స్ అందుకుంటుందని వారు ఆశిస్తున్నారు.