Kidney Stone Problems: కిడ్నీలో రాళ్లు పదేపదే ఏర్పడుతున్నాయా?.. వెంటనే వీటికి దూరంగా ఉండాల్సిందే?

Kidney Stone Problems: కిడ్నీలో రాళ్లు  ఏర్పడడం అనేది ఒక సాధారణ సమస్య. కానీ అది మళ్లీ మళ్లీ జరగడం ప్రారంభించినప్పుడు తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. మూత్రంలో ఖనిజాలు, లవణాలు అధిక మొత్తంలో చేరడం, అలాగే చిన్న స్ఫటికాలు ఏర్పడటం జరిగినపుడు రాళ్ళు ఏర్పడతాయి. ఈ స్ఫటికాలు క్రమంగా పెరుగుతాయి. అలా రాళ్లు పెద్దవిగా పెరగడం వల్ల నొప్పి, మంట, ఇతర సమస్యలను కలిగిస్తుంది.

మీరు కూడా కిడ్నీలో రాళ్ల సమస్య(Kidney Stone Problems)తో బాధపడుతున్నట్లయితే.. రోజువారీ ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. సరైన ఆహారపు అలవాట్లు కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశాలను తగ్గించడంలో చాలా దోహదపడతాయి. కిడ్నీలో రాళ్ల సమస్య(Kidney Stone Problems)ను నివారించడానికి 3 ముఖ్యమైన చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. అవేంటో తెలుసుకుందాం.

భోజనం చేసిన తర్వాత నడిస్తే ఇన్ని ప్రయోజనాలా? అస్సలు మిస్ కావొద్దు!

ఈ 3 సులభమైన ఆహార చిట్కాలు

కిడ్నీలో రాళ్ల సమస్య(Kidney Stone Problems) రాకుండా ఉండాలంటే ఈ మూడింటిని మీ దినచర్యలో క్రమం తప్పకుండా పాటించాలి.

1. ఉప్పు తక్కువగా తినండి

ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల మూత్రంలో కాల్షియం పరిమాణం పెరుగుతుంది. ఇది కాల్షియం రాళ్లను ఏర్పరుస్తుంది. అందువల్ల ఉప్పు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మానుకోవాలి. ఒక రోజులో 5 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తీసుకోవడం హానికరం అని నిపుణులు చెబుతున్నారు.

2. ఆక్సలేట్ ఆహారాలు తగ్గించాలి

ఆహారాలలో బీట్‌రూట్, బచ్చలికూర, బంగాళదుంపలు వంటి వాటిని వీలైనంత తక్కువగా తినండి. చక్కెర పానీయాలు తీసుకోవడం తగ్గించండి. అలాంటి ఆహారాలు మూత్రంతో కలిసిపోయి రాళ్లను ఏర్పరుస్తాయి.

3. నీరు

ప్రతి ఒక్కరి శరీరానికి తగినంత నీరు అవసరం. సరైన మోతాదులో నీరు తాగకపోవడం వల్ల రాళ్లు ఏర్పడతాయి. దీని కోసం మీరు నీరు తీసుకోవడం పెంచాలి.

ఇది కాకుండా మీరు ఆహారంలో ఫైబర్ ఫుడ్స్ తీసుకోవడం పెంచాలి. సహజ ఎలక్ట్రోలైట్స్, విటమిన్ సి ఉన్న ఆహారాన్ని తీసుకోండి. రోజుకు కనీసం 2.5 లీటర్ల నీరు త్రాగాలి. ఈ సులభమైన చిట్కాలతో కిడ్నీలో రాళ్ల సమస్యను సులభంగా అధిగమించవచ్చు.

పల్లీలు చేసే హెల్త్ మ్యాజిక్ గురించి తెలుసా..?

తరవాత కథనం