MAD Squar Trailer: తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న బ్లాక్ బస్టర్ మూవీ ‘మ్యాడ్ స్క్వేర్’. ఈ సినిమా లోని కామెడీ, పాటలు విశేషంగా ఆకట్టుకొని సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ముఖ్యంగా టీజర్, అందులోని సంభాషణలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన సంగతి తెెలిసిందే. ఇక ఇప్పుడు ‘మ్యాడ్ స్క్వేర్’పై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లేలా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.
బుధవారం ఉదయం హైదరాబాద్ లోని ఏఎంబీ మాల్ లో ‘మ్యాడ్ స్క్వేర్’ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. సినీ ప్రేక్షకుల సమక్షంలో ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ట్రైలర్ నవ్వులు పూయించింది. మొదటి భాగంతో పోలిస్తే రెట్టింపు వినోదాన్ని మ్యాడ్ స్క్వేర్ లో చూడబోతున్నామని ట్రైలర్ తో మరోసారి రుజువైంది.
ట్రైలర్‌ను పరిశీలిస్తే, మ్యాడ్ విజయానికి కారణమైన కామెడీ, మెయిన్ పాత్రల అల్లరిని మ్యాడ్ స్క్వేర్‌లో కూడా చూడబోతున్నట్టు ట్రైలర్ చూస్తేనే అర్ధమవుతోంది. హాస్యాస్పదమైన సంభాషణలు, చిత్రమైన పరిస్థితులతో మ్యాడ్ స్క్వేర్ వినోదాన్ని హై లెవల్‌లో తీసుకెళ్లింది. దీంతో పాటు తమన్ సంగీతం ట్రైలర్‌కు ప్రధాన బలాలలో ఒకటిగా నిలిచిందని చెప్పవచ్చు. విడుదలైన కొద్ది నిమిషాల్లోనే ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
‘మ్యాడ్ స్క్వేర్’ సినిమాకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘లడ్డు గానీ పెళ్లి, ‘స్వాతి రెడ్డి’, ‘వచ్చార్రోయ్’ పాటలు సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మ్యాడ్ సినిమాతో థియేటర్లలో నవ్వుల వర్షం కురిపించిన డైరక్టక్ కళ్యాణ్ శంకర్, సీక్వెల్ తో మరోసారి నవ్వుల విందుని ప్రేక్షకులకు అందించబోతున్నారు. ప్రధాన పాత్రలు పోషించిన నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ త్రయం ఫస్ట్ భాగానికి మించిన అల్లరి చేయబోతున్నట్లు తెలుస్తోంది.
మ్యాడ్ స్క్వేర్ సినిమాను శ్రీకర స్టూడియోస్‌తో కలిసి.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య చిత్రీకరుస్తున్నారు.. సూర్యదేవర నాగవంశీ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ప్రేక్షకులు ఊహించిన దానికంటే ఎక్కువ వినోదాన్ని మ్యాడ్ స్క్వేర్ లో చూడబోతున్నారని చిత్ర యూనిట్ పేర్కొన్నారు.
భారీ అంచనాల నడుమ 2025, మార్చి 28న థియేటర్లలో అడుగు పెట్టనున్న మ్యాడ్ స్క్వేర్, ఈ వేసవికి ప్రేక్షకులకు మరిచిపోలేని వినోదాన్ని పంచనుంది.