Homemade Hair Oil: పొడవాటి జుట్టు కావాలా.?అయితే ఈ హెయిర్ ఆయిల్ ట్రై చేయండి

Homemade Hair Oil

Homemade Hair Oil: మీకు పొడవాటి జుట్టు అంటే ఇష్టమా.. ఇందుకోసం మార్కెట్లో లభించే నూనెలతో విసిగిపోయారా.. అయితే ఒక్కసారి ఈ హెయిర్ ఆయిల్‌ను ట్రై చేయండి. మంచి రిజల్ట్ మీకు కనిపిస్తాయి. ఈ రోజుల్లో జుట్టు రాలడం ప్రతి ఒక్కరికి సర్వసాధారణం అయిపోయింది. కొందరికి జుట్టు విపరీతంగా రాలిపోతుంటుంది. మరి కొందరికి వెంట్రుకలు పొడిబారి చిట్లిపోయి ఉంటాయి. పొడవాటి జుట్టు అయితే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కలగానే మిగిలిపోతుంది. మార్కెట్లో దొరికే ఖరీదైన ప్రొడక్ట్స్ ఉపయోగించినప్పటికీ ఫలితం ఉండటం లేదు. పైగా వీటివల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ టిప్స్ ఫాలో అవ్వండి. మంచి రిజల్ట్ మీకు కనిపిస్తాయి. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

హెయిర్ ఆయిల్ తయారీ కావాల్సినవి
కొబ్బరి నూనె
ఉసిరికాయలు
లవంగాలు
మెంతులు
కలబంద ముక్కలు
కరివేపాకు
మందారం పువ్వులు

తయారు చేసుకునే విధానం
ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని.. అందులో కొబ్బరి నూనె, లవంగాలు, మెంతులు, ఉసిరికాయలు, కరివేపాకు, కలబంద ముక్కలు, మందారం పువ్వులు వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మరిగించండి. ఆ తర్వాత స్టవ్ కట్టేసి గాజు సీసాలో వడకట్టుకోండి. ఈ ఆయిల్ క్రమం తప్పకుండా జుట్టుకు అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరిగేందుకు చక్కగా పనిచేస్తుంది. తెల్లజుట్టు సమస్యలు ఉన్నా.. చుండ్రు సమస్యలు నివారించడంలో ఈహెయిర్ ఆయిల్ అద్భుతంగా పనిచేస్తుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు కోసం మాత్రమే.

తరవాత కథనం