ప్రస్తుతం ఐపీఎల్ 2025 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. పలుజట్లు తగ్గాపోరు మ్యాచ్లు ఆడుతున్నాయి. ఇందులో భాగంగానే రీసెంట్ గా గుజరాత్ వర్సెస్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పంజాబ్ ఘన విజయం సాధించింది. ఈ టీం విజయం సాధించడంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కీలక పాత్ర పోషించాడు.
42 బంతుల్లో 97 పరుగులు చేసి అబ్బుర పరిచాడు. మూడు పరుగుల్లో సెంచరీ మిస్ చేసుకున్నాడు. అతడి ఆట తీరుపై పలువురు దిగ్గజాలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ స్పందిస్తూ శ్రేయస్ అయ్యర్ ను ప్రశంసించారు. శ్రేయస్ అయ్యర్ ఆట తీరు గత ఏడాది కంటే ఈ ఏడాది మరింత అద్భుతంగా మెరుగుపడిందని పొగడ్తలతో ముంచేత్తాడు.
అతడు అన్ని ఫార్మాట్లకు సిద్ధంగా ఉన్నాడని కొనియాడాడు. కొన్ని ఇష్యుల తర్వాత శ్రేయస్ తన ఆటను మరింత మెరుగుపరుచుకున్నాడని తెలిపాడు. ఇది చాలా గొప్పగా ఉందని అన్నాడు. ప్రస్తుతం అతడు వ్యాఖ్యలు నెట్టెంటా వైరల్ గా మారాయి.
ఇక గుజరాత్ తో మ్యాచ్ అనంతరం శ్రేయస్ అయ్యర్ మాట్లాడాడు. ఈ మ్యాచ్ లో 97 పరుగులు వద్ద నాటౌట్ గా నిలిచిన శ్రేయస్ తన సెంచరీ విషయంపై స్పందించాడు. నెక్స్ట్ మ్యాచ్ లో సెంచరీ సాధిస్తానని చాలా నమ్మకంగా చెప్పాడు.
గుజరాత్ జట్టు ఎదుట భారీ స్కోర్ ఉండాలనే లక్ష్యంతో ఆడామని అన్నాడు. తన సెంచరీ గురించి పట్టించుకోలేదని.. దానిని నెక్స్ట్ మ్యాచ్ లో సాధిస్తానని తెలిపాడు. ఇక మ్యాచ్ సమయంలో శశాంక్ సింగ్ ను తానే భారీ షాట్లు కొట్టమని చెప్పినట్లు తెలిపాడు. అనంతరం శశాంక్ సింగ్ ఆట తీరుపై ప్రశంసలు కురిపించాడు.
గత ఏడాది అతడి బ్యాటింగ్ శైలిని చూసి తాను స్ఫూర్తి పొందినట్లు తెలిపాడు. అదే తనకు గట్టి విశ్వాసాన్ని అందించిందని పేర్కొన్నాడు. అతడు క్రీజ్ లోకి రాగానే మూడో బంతి నుంచే విజృంభించిన తీరు.. సాధించిన 44 రన్స్ ఎంతో ప్రభావవంతమైనవి అని అన్నాడు. ఫ్యూచర్లో కూడా ఇదే ఆట తీరు కొనసాగిస్తాడని తాను ఆశిస్తున్నట్లు తెలిపాడు.