Benefits of Buttermilk: ప్రతి ఏడాదిలాగానే ఈ వేసవి కూడా మండి పోతుంది. ఈ వేడికి జనాలు రకరకాల ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. దీంతో మధ్యాహ్న సమయంలో బయటకు రావాలంటేనే జంకు తింటున్నారు. ఏ పని ఉన్న ఉదయమో, సాయంత్రమో బయటకు వస్తున్నారే తప్పా.. మధ్యాహ్నం కాలు బయటపెట్టడం లేదు. ఈ క్రమంలోనే వేసవి తాపం నుండి సేదతీరేందుకు చల్లని మార్గాలను పాటిస్తున్నారు. ఈ వేసవికాలంలో చల్లగా మజ్జిగ తాగడం వల్ల శరీరం చల్లబడుతుంది. వేసవి తాపం నుండి ఉపశమనంం లభిస్తుంది.
మజ్జికలో నిమ్మకాయ రసం కలిపి తీసుకుంటే.. వేసవి తాపం నుండి బయటపడవచ్చు. డీ హైడ్రేషన్ నుండి కాపాడుకోవచ్చు. మజ్జికలో ప్రోటీన్స్, మినరల్స్ వంటి ఖనిజాలు అనేక అనారోగ్య సమస్యల నుండి కాపాడతాయి. శరీరంలో కాల్షియం లోపంతో బాధపడేవాళ్లు మజ్జిగను తీసుకోవడం వల్లన శరీరానికి కాల్షియం అందుతుంది. తద్వారా ఎముకలు, దంతాలు దృఢంగా మారతాయి.
తరుచూ మజ్జిగ తాగడం వల్లన శరీరంలో ఉన్న చెడుకొలెస్ట్రాల్ తగ్గుతుంది. మజ్జిగలో ఉండే బయో యాక్టివ్ సమ్మేళనాలు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తాయి. ముఖ్యంగా గ్యాస్, అజీర్తి సమస్యతో బాధపడేవాళ్లు రోజు మజ్జిగ తాగితే మంచి ఫలితం ఉంటుంది. మజ్జిగతో చేసిన ఆహారపదార్ధాలు తరచూ తింటుంటే.. శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అంతేకాదు శరీర వేడిని కూడా తగ్గిస్తుంది.
ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు శరీరంలో ముఖ్యమైన లవణాలు తగ్గిపోతాయి. ఫలితంగా వడదెబ్బ సమస్య తలెత్తే అవకాశం ఉంది. అయితే మజ్జిగలో సహజ లవణాలు ఉండటం వల్ల ఇవి శరీరానికి అవసరమైన సమతుల్యతను కలిగి ఉంచుతాయి. ఎండలో ఎక్కువ సమయం గడిపే వారికి మజ్జిగ తాగడం వల్ల వడదెబ్బ నుంచి రక్షణ కలిగిస్తుంది.
మజ్జిగలో విటమిన్ C, కాల్షియం, ప్రోబయోటిక్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి శరీరంలోని ఇమ్యూనిటీని పెంచడంలో సహాయపడతాయి. మజ్జిగ తాగడం వల్ల ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు వంటి వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవాలంటే మజ్జిగను ఆహారంలో భాగంగా చేర్చుకోవడం ఉత్తమం.
మజ్జిగ తాగడం వల్ల శరీరం హాయిగా, తేలికగా అనిపిస్తుంది. ఇది శరీరానికి మాత్రమే కాదు మానసిక ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మజ్జిగలో ఉండే సహజ పోషకాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. స్ట్రెస్, మానసిక అలసట తగ్గించేందుకు మజ్జిగ మంచి పరిష్కారం.