IPL 2025: కోల్‌కతా ఘన విజయం.. రాజస్తాన్ రాయల్స్ చిత్తు!

ఐపీఎల్ 2025 సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇరుజట్లు మధ్య పోటీ రసవత్తరంగా మారుతోంది. నిన్న కోల్కత్తా వర్సెస్ రాజస్థాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో కోల్కత్తా నైట్ రైడర్స్ ఘన విజయం సాధించింది. తొలి మ్యాచ్లో బెంగళూరు జట్టు పై ఓడిపోయిన కేకేఆర్.. తన నెక్స్ట్ మ్యాచ్ రాజస్థాన్ తో గెలుపొందింది.

8 వికెట్ల తేడాతో రాజస్థాన్‌ను చిత్తు చేసింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. మెల్లిమెల్లిగా పరుగులు రాబట్టింది. ఆ తర్వాత వికెట్లు కోల్పోతూ తడబడింది. యశస్వి జైస్వాల్ 24 బంతుల్లో 29 పరుగులు మాత్రమే సాధించాడు. సంజు సాంసంగ్ కూడా 13 పరుగులకే వెనుతిరిగాడు. ఆ తర్వాత వచ్చిన రియల్ పరాగ్ మొదటి నుంచే దూకుడుగా ఆడటం ప్రారంభించాడు.

కానీ అతడు కూడా ఎక్కువ సమయం క్రీజ్ లో ఉండలేకపోయాడు. 15 బంతుల్లో 25 పరుగులు రాబట్టి పెవిలిన్కు చేరాడు. తర్వాత ఒక్కొక్కరుగా అవుట్ అయ్యారు. మొత్తంగా రాజస్థాన్ రాయల్స్ తొమ్మిది వికెట్ల నష్టానికి 151 పరుగులే సాధించగలిగింది. అందులో ధ్రువ్ జురెల్ ఒక్కడే 28 బంతుల్లో 33 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.

కోల్కత్తా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 17 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. అలాగే మొయిన్ అలీ 23 పరుగులు ఇచ్చి 2 వికెట్లు, వైభవ్ ఆరోరా 33 పరుగులు ఇచ్చి 2 వికెట్లు, హర్షిత్ రానా 36 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తో సత్తా చాటారు.

అనంతరం లక్ష్య చేదనకు దిగిన కోల్కత్తా నైట్ రైడర్స్ 17.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టంతో ఘన విజయం సాధించింది. ముఖ్యంగా డికాక్ అదిరిపో ఇన్నింగ్స్ ఆడాడు. ముఖ్యమైన ఆటగాళ్లందరూ వెనుతిరగడంతో ఆ సమయంలో కోల్కత్తా ఓడిపోతుందని అంతా భావించారు. కానీ డికాక్ ఆత్మవిశ్వాసంతో ఆడి తమ టీంకు విజయం అందించాడు. 61 బంతుల్లో 97 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అతడు మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో కోల్కతా తొలి విజయాన్ని కైవసం చేసుకుంది.

తరవాత కథనం