Sakshi Agarwal : ఓ హీరోయిన్ జిమ్ ఫోటోస్ తాజాగా సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇటీవలే ప్రియుడితో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ భామ.. సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చినా.. నెట్టింట మాత్రం తన గ్లామరస్ ఫోటోస్‌తో కుర్రకారుకు కునుకులేకుండా చేస్తుంది. ఆమె ఎవరో కాదు పైన ఫోటోను చూశారు కదా.. అందులో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ?
తమిళం, కన్నడ, మలయాళం భాషలలో ఎక్కువగా మూవీస్‌లలో నటించింది. ఫస్ట్‌లో ఆమె మార్కెటింగ్ కన్సల్టెంట్.. నటనపై ఆసక్తి కలగడంతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తమిళంలో బిగ్ బాస్ షో పాల్గొని.. ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇంతకీ ఆ హీరోయిన్ మరోవరో కాదండి. సాక్షి అగర్వాల్.
సౌత్ ఇండస్ట్రీలోని సినీ ప్రేక్షకులకు అందరికి పరిచయమైన హీరోయిన్. తమిళంలో బిగ్ బాస్ రియాల్టీ షో సీజన్ 3లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. ఆ తర్వాత హెద్దరి అనే మూవీతో కన్నడ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత తమిళంలో ఫేమస్ డైరక్టర్ అట్లీ రూపొందించిన రాజా రాణి సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించింది. కన్నడలో సాఫ్ట్ వేర్ గండా అనే సినిమాతో మరింత ఫేమస్ అయ్యింది. ఈ మూవీ 2014లో రిలీజ్ అయింది.
ఆ తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కాలా (2018)లో ఈ భామ కీలకపాత్ర పోషించింది. ఈ తర్వాత మళయాళం ఒరాయిరం కినక్కలాల్ అనే సినిమాలో ప్రధానపాత్ర పోషించింది . సిండ్రెల్లా, అరణ్మనై 3, భగీర వంటి పలు మూవీస్ లలో నటించి సూపర్ క్రేజీ సంపాదించుకుంది. ఈ మధ్యకాలంలో తన ప్రియుడు నవనీత్‌ను వివాహం చేసుకుంది. జనవరి 2న వీరిద్దరి వివాహం గోవాలోని ఒక విలాసవంతమైన హోటల్లో జరిగిన సంగతి తెలిసిందే.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన జిమ్ ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. మీరు ఓ లుక్కేయండి.