యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన దేవర గతేడాది విడుదలైంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం సినీ ఆడియన్స్ ని, అభిమానుల్ని ఆకట్టుకుంది. మిక్స్డ్ టాక్ వచ్చినా కలెక్షన్లలో దుమ్ము దులిపేసింది. దీంతో త్వరలో ఈ సినిమా సీక్వెల్ ప్రారంభం కానుంది.
ఈ నేపథ్యంలో దేవర చిత్రాన్ని జపాన్ లో రిలీజ్ చేసేందుకు మేకర్ సిద్ధమయ్యారు. మార్చ్ 28 అంటే రేపు రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్ ప్రమోషన్ వేగవంతం చేశారు. ఇందులో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ జపాన్ లో పర్యటించారు. అక్కడ ఆడియన్స్ తో ముచ్చటించారు. ఎన్టీఆర్ ను చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు.
అదే సమయంలో ఓ అభిమాని ఎన్టీఆర్ ను ఆశ్చర్యపరిచింది. ఎన్టీఆర్ ఆటోగ్రాఫ్ కోసం వచ్చిన జపాన్ అభిమాని తెలుగు మాట్లాడుతూ ఎన్టీఆర్ మనసు దోచుకుంది. ‘అన్నా నేను ఆర్ఆర్ఆర్ సినిమా చూసిన తర్వాత తెలుగు నేర్చుకున్నాను. ‘అంటూ ఆమె తెలుగులో రాసిన ఒక పుస్తకాన్ని ఎన్టీఆర్ కు చూపించింది.
అది చూసిన ఎన్టీఆర్ ఒక్కసారిగా ఫిదా అయిపోయాడు. వావ్ అమేజింగ్ అంటూ మీరు నిజంగా ఒక స్ఫూర్తి అని కొనియాడాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇదే విషయంపై ఎన్టీఆర్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. తన జపాన్ సందర్శన తనకు ఎప్పుడూ అందమైన జ్ఞాపకాలు ఇస్తాయని అన్నాడు. కానీ ఈసారి మాత్రం తనకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది అని తెలిపాడు. ఒక జపనీస్ అభిమాని ఆర్ఆర్ఆర్ చూసిన తర్వాత తెలుగు నేర్చుకున్నాను అని చెప్పడం ఆనందంగా ఉంది అని అన్నారు.
ఆ మాట నిజంగా తనను కదిలించింది అనితెలిపారు. ఒక కల్చర్కు, ప్రేమకు సినిమా ఈరోజు వారధిగా నిలిచిందని అన్నారు. ఇది తాను ఎప్పటికీ మర్చిపోలేని ఒక విషయం అని చెప్పుకొచ్చాడు