Health Tips: తమలపాకులతో చర్మ మొటిమలకు చెక్ పెట్టండి..! ఎలా అంటే?

ప్రతి సీజన్‌లో చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఎంత జాగ్రత్తగా చూసుకుంటే చర్మం అంతే మెరుస్తూ కనిపిస్తుంది. కానీ ఒక్కోసారి మన స్కిన్ ఛేంజ్ అవుతూ ఉంటుంది. ఎవేవో కెమికల్ ప్రొడెక్ట్స్ రాసేటప్పుడు ముఖం కలర్ మారిపోతూ ఉంటుంది. అలాగే ముఖంపై మచ్చలు, మొటిమలు వంటి సమస్యలు కనిపిస్తాయి. మీరు కూడా అలాంటి సమస్యతోనే బాధపడుతుంటే మీకు తమలపాకులు ఎంతగానో సహాయపడతాయి. చర్మంపై తమలపాకును ఉపయోగించడం వల్ల చర్మ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం.

తమలపాకుల ప్రయోజనాలు

మీ చర్మంపై తమలపాకులను ఉపయోగించుకోవచ్చు. ఇది చర్మానికి ప్రయోజనకరమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను అందిస్తుంది. అందువల్ల ముఖాన్ని చల్లగా ఉంచడానికి దీనిని ఉపయోగిస్తారు. దీనిని వివిధ మార్గాల్లో పూయడం ద్వారా చర్మ సమస్యలను కూడా తొలగించవచ్చు.

మొటిమలను తగ్గిస్తాయి

మురికి, జిగట కారణంగా ముఖంపై మొటిమల సమస్య తరచుగా కనిపిస్తుంది. అలాగే మారుతున్న జీవనశైలి కారణంగా కూడా ఈ సమస్య వస్తుంది. అటువంటి పరిస్థితిలో చర్మంపై తమలపాకును ఉపయోగించడం చాలా ముఖ్యం. నిపుణులు కూడా దీనిని పూయమని సిఫార్సు చేస్తున్నారు.

దీని కోసం తమలపాకును నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత దానిని మిక్సర్‌లో రుబ్బుకోవాలి. తర్వాత దాని పేస్ట్‌ను తీసి నీటిని బాగా ఫిల్టర్ చేయండి. దీని తర్వాత కాటన్ ప్యాడ్‌తో మీ ముఖంపై అప్లై చేయండి. దీన్ని అప్లై చేయడం వల్ల మొటిమల చికాకు తగ్గుతుంది. అలాగే చర్మం శుభ్రంగా కనిపిస్తుంది.

నల్లటి మచ్చలను తగ్గిస్తుంది

ముఖంపై మొటిమలు లేదా మొటిమలు ఎండిన తర్వాత నల్లటి మచ్చలు కనిపిస్తాయి. దీని కోసం చాలామంది రకరకాల క్రీములను వాడుతారు. కానీ వాటికి బదులుగా, తేనెతో తమలపాకును అప్లై చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఇది చర్మంపై సమస్యను తగ్గిస్తుంది. అలాగే ఇది ముఖాన్ని శుభ్రంగా కనిపించేలా చేస్తుంది.

చర్మాన్ని తెల్లగా చేయడంలో

మీ ముఖాన్ని శుభ్రం చేయడానికి తమలపాకును అప్లై చేయవచ్చు. ఇది ముఖం మెరుపును రెట్టింపు చేస్తుంది. దీని కోసం, తమలపాకును రుబ్బి పేస్ట్ చేయాలి. తరువాత, దాని నీటిని పిండుకుని శనగపిండిలో కలపండి. కొద్దిగా పసుపు కలిపి పేస్ట్ లా చేసి ముఖానికి ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేయండి. దీన్ని అప్లై చేయడం వల్ల ముఖం శుభ్రం అవుతుంది.

తరవాత కథనం