బ్లడ్ ప్రెషర్ రోగులకు శీతాకాలం, వేసవి సీజన్లలో అనేక సమస్యలు తలెత్తుతాయి. చలికాలంలో చల్లటి వాతావరణం కారణంగా రక్తనాళాలు కుంచించుకుపోయి ఒకదానికొకటి గడ్డ కట్టడం ప్రారంభిస్తాయి. అదేవిధంగా వేసవిలో అత్యధిక సూర్యకాంతి సమయంలో రక్త నాళాల సంకోచం కూడా తగ్గుతుంది. దీంతో వీరిలో వేసవిలో బీపీ తక్కువగా ఉంటే.. చలికాలంలో ఎక్కువగా ఉంటుంది. బీపీ పేషెంట్లు బ్లడ్ ప్రెషర్ పారామీటర్స్ సరిగా చెక్ చేసుకోకపోతే చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. బీపీలో హెచ్చుతగ్గులు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. అలాంటి సమయంలో సరైన చికిత్స తీసుకోవాలి. అలాగే కొన్ని విషయాలలో జాగ్రత్త తీసుకోవాలి.
వైద్యులు ఏమంటున్నారంటే..?
వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల రక్తపోటు హెచ్చుతగ్గులకు లోనవుతుంది. దీనివల్ల బీపీ నియంత్రణకు మందులు వాడేవారిలో లోబీపీ సమస్య పెరుగుతుంది. వారు తమ బిపిని క్రమం తప్పకుండా చెక్ చేసుకోవాలి.
తక్కువ బీపీకి కారణాలు?
వేసవిలో బీపీ తగ్గడానికి ప్రధాన కారణం శరీరంలో డీహైడ్రేషన్. ఇది శరీరంలో నీటి కొరత వల్ల ఏర్పడుతుంది. అలాగే శరీరంలో ఉప్పును తగ్గించడం వల్ల కూడా బీపీ లెవెల్స్ తగ్గుతాయి. వేసవిలో ఉప్పు తగ్గడానికి ప్రధాన కారణం చెమట. చెమట పట్టడం వల్ల శరీరంలో సోడియం స్థాయి తగ్గుతుంది. సోడియం తగ్గడం వల్ల తలనొప్పి, తలతిరగడం, అలసట, పడుకున్న తర్వాత హఠాత్తుగా లేవడం. ఆ తర్వాత కూడా కళ్లు తిరగడం వంటివి జరుగుతాయి. వేసవిలో బీపీ తక్కువగా ఉండటం వల్ల హీట్ స్ట్రోక్, హార్ట్ ఎటాక్, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాకుండా తక్కువ BP వల్ల అస్పష్టమైన దృష్టి, వాంతులు, మూర్ఛ, బలహీనమైన అనుభూతి కలిగిస్తుంది.
నివారణ చర్యలు
శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచాలి. దీనికోసం పుష్కలంగా నీరు తాగాలి. తద్వారా శరీరంలో నీటి కొరత ఉండదు.
చల్లని ప్రదేశాలలో ఉండాలి. ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో విపరీతమైన వేడిలో బయటకు వెళ్లకుండా ఉండాలి.
త్వరగా జీర్ణం అయ్యే ఆహారాన్ని తినాలి. టీ, కాఫీని తీసుకోకుండా ఉండాలి.
సత్తు, కొబ్బరి నీళ్లు, తాజా పండ్ల రసం తాగాలి.
చిన్నపిల్లలు, వృద్ధులు ఇళ్లలోనే ఉండాలి.
బయటి ఆహారానికి వీలైనంత దూరంగా ఉండాలి.