Natural Hair Oil: ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో జుట్టు సమస్య కూడా ఒకటి. ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా కూడా జుట్టు రాలిపోతూ ఉంటుంది. అయితే కొంత మందిలో జుట్టు మళ్లీ పెరగకుండా పల్చగా తయారవుతుంది. కానీ కొన్ని బేసిక్ హెయిర్ కేర్ టిప్స్ ఫాలో చేస్తే జుట్టు పెరుగుతుంది. కొబ్బరి నూనెలో కొన్ని రకాల పదార్థాలను కలిపి తలకు రాస్తే జుట్టు ఖచ్చితంగా పెరగడం ఖాయం.
అయితే చాలా మంది జుట్టు పెరగడం కోసం రకరకాల హెయిర్ సీరమ్‌లు యూజ్ చేస్తుంటారు. వీటివల్ల అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్‌ను ఉపయోగించడం వల్ల కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు వీటికి బదులుగా ఇంట్లోనే సొంతంగా ఆయిల్‌ని తయారు చేసుకునే రాసుకోవచ్చు. మరి హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్ధాలు
కొబ్బరి నూనె
కరివేపాకు
బ్లాక్ సీడ్స్
అల్లం
మెంతులు
ఉల్లిపాయలు
కలబంద
తయారు చేసుకునే విధానం
ముందుగా స్టవ్ వెలిగించి గిన్నెపెట్టుకుని.. అందులో కావాల్సినంత కొబ్బరి నూనె వేసుకుని అందులో కరివేపాకు కప్పు , మెంతులు కప్పు, బ్లాక్ సీడ్స్ కప్పు, అరకప్పు కలబంద గుజ్జు, ఉల్లిపాయలు కప్పు ఇలా సమపరిమాణంలో తీసుకుని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మరిగించండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి గాజు సీసాలోకి వడకట్టుకోండి. కొద్ది రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఆ హెయిర్ ఆయిల్‌ను ప్రతిరోజు జుట్టుకు పెట్టుకుని బాగా మసాజ్ చేయండి. లేదంటే రాత్రి పడుకునే ముందు పెట్టుకుని మరుసటి రోజు తలస్నానం చెయ్యండి.
ఇలా క్రమం తప్పకుండా చేస్తే.. మంచి ఫలితం ఉంటుంది. మీ జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. ఇందులో ఉపయోగించే పదార్ధాలు జుట్టుపెరుగుదలకు కావాల్సిన పోషకాలు పుష్కలంగా అందిస్తాయి. అంతే కాదు తెల్లజుట్టును తగ్గించడంతో పాటు చుండ్రు సమస్యలను దూరం చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం మీరుకూడా ఒకసారి ట్రే చేయండి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. అందం, ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.