Kissik Song: ‘పుష్ప2’ కిస్సిక్ సాంగ్ మేకింగ్ వీడియో వచ్చేసింది.. ఇంతలా కష్టపడ్డారా?

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో విడుదలైన పుష్ప 2 ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ టాక్ అందుకోవడంతో సెకండ్ పార్ట్ పై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. దానికి తగ్గట్లుగానే దర్శకుడు గూస్ బంప్స్ తెప్పించే సన్నివేశాలను సినిమాలో పెట్టి అదర కొట్టేసాడు.

ఈ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఏకంగా రూ.1800 – రూ.2000 కోట్ల మధ్య వసూలు రాబట్టి దుమ్ము దులిపేసింది. కనీవిని ఎరుగని రేంజ్ లో సినీ ప్రియులను ఆకట్టుకుంది. ఇందులో అల్లు అర్జున్ డైలాగ్స్, మేనరిజంతో పాటు సాంగ్స్ కెవ్వు కేక అనిపించాయి. ముఖ్యంగా శ్రీలీల స్టెప్పులేసిన కిసిక్ సాంగ్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది.

ఈ సాంగ్లో అల్లు అర్జున్, శ్రీలీల డాన్స్ కు అభిమానులు, సినీ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. కిస్సిక్ అంటూ అదరగొట్టేసారు. అయితే సినిమా రిలీజ్ కి ముందు ఈ సాంగ్ ఏం బాగోలేదని టాక్ నడిచింది. కానీ అలా అలా ఈ సాంగ్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ సాంగ్లో శ్రీలీలా తన అందం, డాన్స్ తో కుర్ర కారును హీటెక్కించింది.

ఇప్పుడు తాజాగా ఈ సాంగ్ మేకింగ్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో శ్రీ లీల, అల్లు అర్జున్ ఎంతలా కష్టపడ్డారో చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ పాట కోసం శ్రీలీల చేసిన రిహార్సల్ చూపించారు. ప్రస్తుతం ఈ మేకింగ్ వీడియో వైరల్ గా మారింది.

తరవాత కథనం