ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షక ఆదరణ సంపాదించుకున్నాడు. పుష్ప పార్ట్ 1 మూవీతో అల్లాడించిన అల్లు అర్జున్ ఆ తర్వాత పుష్ప పార్ట్ 2 సినిమాతో మరింత దుమ్ము దులిపేశాడు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. దాదాపు 2000 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ సాధించి రికార్డులు క్రియేట్ చేసింది.
ఇక దీని తర్వాత అల్లు అర్జున్ ఎవరితో సినిమా చేస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే దర్శకుడు త్రివిక్రమ్ తో సినిమా చేస్తాడని వార్తలు జోరుగా సాగాయి. అతడితో పాటు కోలీవుడ్ స్టార్ అట్లీతో సైతం సినిమా చేస్తాడని ప్రచారం జరిగింది. వీరిద్దరిలో బన్నీ ఎవరితో సినిమా చేస్తాడు అనే వెయిట్ చేస్తున్నారు.
ఈ క్రమంలో అదిరిపోయే సర్ప్రైజ్ వారికి అందింది. అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమాను అట్లీతో చేయనున్నట్లు తెలిసింది. షారుక్ ఖాన్ జవాన్ చిత్రంతో బాక్సాఫీస్ బద్దలు కొట్టిన అట్లీ ఇప్పుడు అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నాడు అని తెలియడంతో అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా అప్డేట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఓ అప్డేట్ వచ్చి సర్ప్రైజ్ అందించింది. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రం బన్నీ బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 8న అఫీషియల్ గా అనౌన్స్ అయ్యే అవకాశం ఉందని తెలిసింది. అంతేకాకుండా ఇది పునర్జన్మ కాన్సెప్ట్ తో ముడి పడి ఉన్న భారీ పీరియాడిక్ డ్రామా స్టోరీతో ముస్తాబు అవుతుందని సమాచారం అందింది.
ఇక కథకు తగ్గట్లుగానే అల్లు అర్జున్ ఇందులో రెండు భిన్న గెటప్లలో కనువిందు చేయనున్నట్లు సినీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. దానికి అనుగునంగానే ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని తెలిసింది. అన్ని అనుకున్నట్లు కుదిరితే ఈ సినిమా షూటింగ్ జూలై లేదా ఆగస్టులో ప్రారంభమైయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.