SRH Vs LSG: ఉప్పల్‌లో కొడితే తుప్పల్లో పడింది.. పూరన్ పూనకాలతో లక్నో ఘన విజయం!

ఐపీఎల్ 2025 18వ ఎడిషన్ రసవత్తరంగా సాగుతోంది. ఇందులో భాగంగానే నిన్న లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ హైదరాబాద్ సన్రైజర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో లక్నో జట్టు ఘనవిజయం సాధించింది. తొలి మ్యాచ్ను ఢిల్లీ క్యాపిటల్స్ కు సమర్పించుకున్న లక్నో.. తన రెండో మ్యాచ్లో ఆ తప్పు చేయలేదు. ఐపీఎల్ లోనే బలమైన టీం గా చెప్పుకుంటున్న హైదరాబాద్ సన్రైజర్స్ ను మట్టిగరిపించి తొలి విజయాన్ని కైవసం చేసుకుంది. ఐదు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.

మొదట లక్నో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో సన్రైజర్స్ చెట్టు బ్యాటింగ్ కు దిగింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా దిగారు. మొదటినుంచి దూకుడు ప్రదర్శించారు. కానీ అతి తక్కువ సమయంలోనే అభిషేక్ శర్మ క్రీజ్ లో నిలబడలేకపోయాడు. కేవలం 6 పరుగులకే వెనుతిరిగాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ (0) పరుగులకే డక్ అవుట్ అయ్యాడు.

కాసేపు ట్రావెస్ హెడ్ పరుగులు రాబట్టాడు. 28 బంతుల్లో 47 పరుగులు సాధించి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి 28 బంతుల్లో 32 పరుగులు సాధించి వెనిదిరిగాడు. ఇలా మొత్తంగా సన్రైజర్స్ జట్టు నిర్దేశించి 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 190 పరుగులు సాధించింది. లక్నో బౌలర్లు సన్రైజర్స్ జట్టుకు చెమటలు పట్టించారు. ముఖ్యంగా శార్దుల్ అదరగొట్టేసాడు. 34 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసి విజృంభించాడు.

ఈ లక్ష్య చేదనకు దిగిన లక్నో జట్టు ఆరంభం నుంచి అదరగొట్టేసింది. ముఖ్యంగా నికోలస్ పూరన్ పూనకాలు తెప్పించాడు. ఉప్పల్ స్టేడియంలో కొడితే తుప్పల్లో పడినట్టు తుక్కుతుక్కు బాధడు. ఫోర్లు సిక్సర్లతో దుమ్ము దులిపేశాడు. కేవలం 18 బంతుల్లోనే ఆఫ్ సెంచరీ చేసి అదరగొట్టేశాడు.

పూరన్ కి మార్స్ తోడవడంతో విజయం మరింత సులభం అయింది. నికోలాస్ పురన్ 26 బంతుల్లో 70 పరుగులు చేసి తమ జట్టు విజయం సాధించడంలో కీలకంగా వ్యవహరించాడు. మొత్తంగా లక్నో 16.1 ఓవర్లలోనే ఐదు వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని చేదించింది. దీంతో తొలి విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది.

తరవాత కథనం