Cholesterol Control: ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా గ్రీన్ ఫుడ్స్ తినాల్సిందే అని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అవి కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతూ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ద్రాక్ష, బ్రోకలీ, ఆకుకూరలు, క్యాబేజీ వంటి గ్రీన్ ఫుడ్స్ రోజువారీ ఆహారంలో చేర్చితే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.
ద్రాక్షలో రాగి, ఇనుము, మాంగనీస్ వంటి సూక్ష్మ పోషకాలు ఉంటాయి. ఈ పోషకాలు ఎముకలు ఏర్పడటానికి, బలంగా తయారవడానికి సహాయపడతాయి. ద్రాక్షలో ఫాలిఫనాల్స్ అనే శక్తివంతమైన అనామ్లజనకాలు కలిగి ఉంటుంది. ఇది అన్నవాహిక, ఊపిరితిత్తుల, నోరు, కంఠం, గర్భాశయ, ప్యాంక్రియాటిక్, ప్రోస్టేట్, పెద్దప్రేగు వచ్చే అనేక రకాల క్యాన్సర్స్ ని తగ్గిస్తుంది. ద్రాక్షను ప్రతిరోజు తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుందట.
బ్రోకలీ జ్యూస్‌లో విటమిన్ సి మరియు విటమిన్ ఇ పుష్కలంగా ఉన్నాయి, ఇవి రోగనిరోధక వ్యవస్థకు మద్దతునిస్తాయి. ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో సహాయపడే యాంటీ కార్సినోజెనిక్ గుణాన్ని కూడా కలిగి ఉంది. బ్రోకలీ జ్యూస్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బ్రోకలీలో తక్కువ క్యాలరీలు ఉండటం వల్ల బరువు తగ్గడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అంతే కాదు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
అవకాడోలో మోనోశాచురేటెడ్ కొవ్వు ఉంటుంది. ఇది శరీరానికి మంచి కొవ్వుగా పరిగణించబడుతుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. అవకాడోను క్రమం తప్పకుండా తీసుకోవడం గుండె సంబంధిత సమస్యలు రాకుండా చూడడంలో సహాయపడుతుంది. అలాగే అవకాడోలో విటమిన్ E, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచటానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అవకాడోను సలాడ్‌లలో, స్మూతీలలో వాడుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ప్రతిరోజూ తీసుకొనే ఆహారంలో ఆకుకూరలను తప్పకుండా చేర్చాలి. తద్వారా అనీమియాను నివారించి, చక్కని ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఆకుకూరల్లో కాల్షియం, బీటాకెరోటిన్, విటమిన్ – సి కూడా పుష్కలంగా ఉంటాయి. విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.
క్యాబేజీ కూడా కొలెస్ట్రాల్ తగ్గించే అద్భుతమైన ఆహారం. క్యాబేజీలో తక్కువ కేలరీలు ఉండటంతో పాటు అనేక అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. ఈ క్రూసిఫరస్ వెజిటేబుల్ ఫైబర్, విటమిన్ సి, విటమిన్ కె అధికంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరచడజంతో పాటు.. ఎముకల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. క్యాబేజీని తినడం వల్ల గుండె జబ్బులు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
ద్రాక్ష, బ్రోకలీ, అవోకాడో, ఆకుకూరలు, క్యాబేజీతో పాటు మరికొన్ని ఆకుపచ్చ ఆహారాలు కూడా కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో తోడ్పడతాయి. ముల్లంగి ఆకులు, చింతచిగురు, గోంగూర వంటి ఆకుకూరలు కూడా ఆరోగ్యకరమైనవి. ఈ ఆకుపచ్చ ఆహారాలు శరీరానికి మంచి పోషకాలను అందించి, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.