Summer Health Tips: వేసవిలో నీరు తాగడం ఇంత ముఖ్యమా? అస్సలు ఊహించలేరు!

వేసవిలో తగినంత నీరు త్రాగడం ఎందుకు ముఖ్యం? రోజుకు ఎంత తాగాలో తెలుసుకోండి

వేసవి కాలం వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. ఇంటి నుంచి బయటకు రావాలంటే ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఈ సీజన్‌లో శరీరంలో తగినంత నీరు లేకపోవడం వల్ల అనేక వ్యాధులు వస్తాయి. చాలా మంది శీతాకాలంలో నీరు త్రాగడానికి ఇష్టపడరు. కానీ వేసవిలో కూడా ఇలా చేస్తుంటే, అది మీకు చాలా సమస్యలను కలిగిస్తుంది. తాగే నీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వేసవిలో నీరు తాగడం చాలా అవసరం.

వేసవిలో శరీరం సంకేతాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. దీంతో దాహం వేసినప్పుడు కచ్చితంగా నీరు త్రాగడానికి ప్రయత్నించాలి. అలాగే మీ కార్యకలాపాలను గుర్తుంచుకోవాలి. మీరు బయట పని చేస్తుంటే లేదా శారీరక శ్రమ చేస్తుంటే.. నీటి అవసరం పెరుగుతుంది. అందువల్ల అప్పుడు శరీరానికి సరిపడా వాటర్ తీసుకోవాలి.

ఉదయం గ్లాసు నీరు

మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక గ్లాసు నీరు త్రాగడం వల్ల శరీరం రిఫ్రెష్ అవుతుంది. జీవక్రియ వేగవంతం అవుతుంది.

పండ్లు, కూరగాయలు

వేసవిలో ఎక్కువగా పండ్లు, జ్యూస్‌లు తాగాలి. పుచ్చకాయ, దోసకాయ, నారింజ వంటి పండ్లు, కూరగాయలు ఉత్తమం.

శరీరానికి ఎంత నీరు అవసరం?

ఒక సాధారణ వ్యక్తి రోజుకు 2.5-3 లీటర్ల నీరు తాగాలి. అయితే ఈ పరిమాణం శరీర బరువు, శారీరక శ్రమ, వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. వేసవిలో చెమట ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నీటి అవసరం సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది.

వేసవిలో నీరు తాగడం వల్ల ప్రయోజనాలు

వేసవిలో నీరు తాగడం వల్ల శారీరక సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది. తాగే నీరు శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడమే కాకుండా, రోజు పనికి శక్తిని అందిస్తుంది. దీని సహాయంతో మీరు రోజంతా మెరుగ్గా పని చేయవచ్చు. శరీరం పూర్తిగా హైడ్రేటెడ్‌గా ఉన్నప్పుడు.. శారీరక శ్రమ కూడా మెరుగుపడుతుంది.

అలాగే మలబద్ధకం సమస్య నుండి ఉపశమనం పొందుతారు. మలబద్ధకంతో బాధపడుతుంటే చేయవలసిన మొదటి పని తగినంత నీరు తాగడం. ఇలా చేయడం వల్ల మలబద్ధకం సమస్య నుండి చాలా వరకు ఉపశమనం పొందవచ్చు.

మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. వేసవిలో శరీరం సాధారణ పనులను కూడా చేయడంలో ఇబ్బంది పడవచ్చు. ఎందుకంటే మెదడు హైడ్రేషన్ ద్వారా బాగా ప్రభావితమవుతుంది. అధ్యయనాల ప్రకారం.. కొద్దిగా డీహైడ్రేషన్ కూడా మెదడు పనితీరును ప్రభావితం చేస్తుంది. అందువల్ల వేసవిలో తగినంత నీరు తాగడం చాలా అవసరం

తరవాత కథనం