ఈ సంవత్సరం ఉగాది మార్చి 30వ తేదీనా వచ్చిది. ఉగాది పండుగ తెలుగువారికి తొలి పండుగ.. మరి ఈ స్పెషల్ డే రోజున మీ స్నేహితులతు, బంధుమిత్రులకు, ప్రియమైనవారికి అందంగా ఇలా శుభాకాంక్షలు తెలియజేయండి.
తిమిరాన్ని పారదోలే ఉషోదయంలా చిగురాకుల ఊయలలో నవరాగాల కోయిలలా అడుగిడుతున్న ఉగాదికి స్వాగతం. మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది పండుగ శుభాకాంక్షలు.
తీపి, చేదు కలిసిందే జీవితం.. కష్టం, సుఖం తెలిసిందే జీవితం.. ఆ జీవితంలో ఆనందోత్సవాలు పూయించుకునేందుకు వస్తుంది ఈ ఉగాది పర్వదినం. మీకు మీ కుటుంబ సభ్యులకు క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు.
మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
మామిడి పువ్వుకి మాట వచ్చింది.. కోకిల గొంతుకి కూత వచ్చింది.. వేప కొమ్మకి పూత వచ్చింది. పసిడి బెల్లం తోడు వచ్చింది.. గుమ్మానికి పచ్చని తోరణం వచ్చింది. పండుగ మన ముందుకు వచ్చింది.
కొత్త ప్రారంభాలు, కొత్త అవకాశాలు, కొత్త ఆశీర్వాదాలతో మీకు మంచి జరగాలని మనసారా కోరుకుంటూ శ్రీ కోధినామ సంవత్సర శుభాకాంక్షలు.
ఈ కొత్త సంవత్సరంలో మీరు అనుకున్నవన్ని జరగాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు.
ఈ ఆనందకరమైన కొత్త సంవత్సరంలో భగవంతుడు మీకు ఆశీర్వచనాలు , ఆరోగ్యం, శ్రేయస్సును కలుగజేయాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు