Upcoming Movies 2025: ఇండస్ట్రీలో ఈ మధ్య సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంది. ప్రతి నెల కొత్త సినిమాలు జోరుగా రిలీజ్ అవుతూనే ఉన్నాయి. మార్చి నెలతో పోలిస్తే ఏప్రిల్ నెల జాతరగా ఉండనుంది. ఏకంగా 19 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిలో కొన్ని సినిమాలపై పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ అయ్యాయి. కన్నప్ప, భైరవం, ఘాటీ చిత్రాలపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. 20 తర్వాత రిలీజ్ అవుతున్న సినిమాలపై హోప్స్ ఉన్నాయి.
రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో కొత్తగా రూపొందుతున్న చిత్రం శారీ. మూడు నాలుగేండ్ల క్రితం సోషల్ మీడియా రీల్స్‌తో ఫేమస్ అయిన కేరళ బ్యూటీ ఆరాధ్య దేవిని కథానాయికగా పరిచయం అవుతున్నది. ఈ మూవీ ఏప్రిల్ 4న థియేటర్లలో రిలీజ్ కాబోతున్నది.
యాక్టర్ మోహన్ లాల్ ప్రస్తుతం ఓ వృషభ అనే భారీ బడ్జెట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కనెక్ట్ మీడియా, బాలాజీ టెలీ ఫిల్మ్స్ నిర్మిస్తున్నాయి. ఈ మూవీని శోభా కపూర్, ఏక్తా కపూర్, సీకే పద్మ కుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ వ్యాస్, విశాల్ గుర్నాని చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాకి నంద కిషోర్ దర్శకుడు.
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. తొమ్మిదేళ్ల కిందటి నుంచే ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు మంచు విష్ణు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపిన సంగతి తెలిసిందే.. తన కెరీర్ లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ లాంటి పాన్ ఇండియా స్టార్లు ఇందులో ప్రముఖ పాత్రలో నటిస్తున్నారు. అయినా ఎందుకో ఈ మూవీకి మాత్రం బజ్ రావడం లేదు. ఎంత చేసినా, ఏం చెప్పినా సినిమా మీద నెగెటివ్ వైబ్స్, ట్రోల్స్ తప్ప ఏమీ కనిపించడం లేదు. చివరకు ప్రభాస్ ఉన్నాడు అనే ఒక చిన్న హోప్ తప్ప, సినిమాకు ప్రత్యేకించి వస్తున్న పాజటివ్ వైబ్స్ ఏమీ లేవు. ముఖేశ్ కుమార్ సింగ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ మూవీ ఏప్రిల్‌లో రిలీజ్ అవుతుంది.
అనుష్క నటించిన ఘాటీ, బాలకృష్ణ ఆదిత్య 369 సినిమాలపై భారీ హైప్ ఉంది. మొత్తానికి ఏప్రిల్‌లో చిన్న సినిమాల మధ్య టఫ్ పోటీ జరగబోతుందనే చెప్పాలి. వీటిలో ఏ మూవీ ఎలాంటి టాక్‌ను సొంతం చేసుకుంటుందో తెలియాలంటే థియేటర్లలోకి వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.
ఏప్రిల్‌లో రిలీజ్ అవుతున్న సినిమాలు
ఏప్రిల్ 4
శారీ
వృషభ
లెవల్
ఆదిత్య 369
28 సీ
సీతన్న పేట్ గేట్
ఏప్రిల్ 10
జాక్
జాట్
ఏప్రిల్ 11
అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి
ఏప్రిల్ 17
ఓదెల 2
ఏప్రిల్ 18
మధురం
ఘాటీ
చౌర్య పాఠం
సారంగపాణి
మ్యాజిక్
ఏప్రిల్ 25
కన్నప్ప
భైరవం
ఎర్రచీర
ఏప్రిల్ 30
భద్ర కాళీ