Chahatt Khanna fitness tips: నటి చాహత్ ఖన్నా ఫిట్‌నెస్ రహస్యాలు.. 30ఏళ్లు పైబడిన వారికి బెస్ట్ టిప్స్!

ఇప్పుడు  చాలా మంది సెలబ్రిటీలు ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెడుతున్నారు. ఆరోగ్యంగా ఉండాలని గంటలు గంటలు జిమ్‌లలో తెగ కష్టపడుతున్నారు. అలాంటి ఫిట్ నెస్‌తోనే ఓ హీరోయిన్ ఈ మధ్య తెగ వైరల్ గా మారింది. బడే అచ్చే లాగ్తే హై, కుబూల్ హై, యాత్రి, ప్రస్థానం వంటి సిరీస్‌లలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి చాహత్ ఖన్నా ఫిట్‌నెస్ గురించి చాలా కాలంగా వార్తల్లో నిలుస్తుంది. ఆమె తన ఫిట్‌నెస్‌కు సంబంధించి ప్రతి ఒక్కరికీ ప్రేరణగా మారింది. అంతేకాకుండా చాహత్ తన ఫిట్‌నెస్ ఆరోగ్యం.. అలాగే మరీ ముఖ్యంగా 30 ఏళ్ల వయస్సు పైబడిన మహిళలకు కొన్ని టిప్స్ అందించారు.

ప్రోటీన్ ఎందుకు ముఖ్యమైనది?

30 ఏళ్ల తర్వాత హెల్తీ ఆరోగ్యం, జీవనశైలిని కాపాడుకోవడం గురించి ఆమె కొన్ని విషయాలు పంచుకున్నారు. ఎక్కువగా ప్రోటీన్ తీసుకోవడంపై ప్రాధాన్యత తీసుకుంటున్నట్లు తెలిపారు. అయితే 30 ఏళ్ల తర్వాత ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఒక పెద్ద సవాలు అని ఆమె పేర్కొన్నారు. అందువల్లనే 30 ఏళ్లుపైబడిన వారికి ప్రోటీన్ ఎక్కువగా ఉపయోగపడుతుందని ఆమె తెలిపారు.

వారి శరీరానికి ప్రోటీన్ చాలా ముఖ్యం అన్నారు. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్నప్పుడు.. 30 ఏళ్లు పైబడిన మహిళలకు, జీవక్రియను పెంచడానికి, చురుకుగా ఉంచడానికి, కండరాలను బలంగా ఉంచడానికి ప్రోటీన్ చాలా ముఖ్యం అని ఆమె తెలిపారు.

ఆరోగ్యకరమైన ఆహారం

శాఖాహారం, ఆకుకూరలలో గల ప్రోటీన్ల ప్రయోజనాలను ఆమె వివరించారు.  వీటిలో ప్రోటీన్‌లు అత్యధికంగా ఉంటాయని తెలిపారు. ఇవి అవసరమైన అమైనో ఆమ్లాలను అందిస్తాయి. ఈ ఆహారం వ్యాయామం చేసేవారికి మంచిగా ఉపయోగపడుతుంది. శాకాహార ప్రొటీన్లు, ప్రొటీన్ పౌడర్లు, సప్లిమెంట్లతో పాటుగా గుడ్లు తింటే చాలా  ప్రోటీన్లు అందుతాయని.. తాను కూడా  వాటినే ఎక్కువగా ఇష్టపడతానని పేర్కొంది. వాటి ద్వారా అందేే శక్తితో వెయిట్ లిఫ్టింగ్ కూడా చేస్తానని తెలిపారు. దీనితో పాటు, వ్యాయామం కూడా కండరాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుందన్నారు.

తరవాత కథనం